TV Actress: పెళ్లి కొడుక్కి విస్కీ బాటిల్ గిఫ్ట్‌గా ఇద్దామని అనుకున్న నటి.. అలా జరగడంతో పోలీసులకు ఫిర్యాదు..

By team teluguFirst Published Nov 28, 2021, 5:14 PM IST
Highlights

తన కుటుంబంలో జరిగే పెళ్లి వేడుక కోసం ఓ టెలివిజన్ నటి (TV Actress) అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పెళ్లి కొడుక్కి అమృత్ విస్కీ బాటిల్‌ను (Amrut whiskey) బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఆమె ఓ ప్రముఖ టీవీ నటి (TV Actress). పలు హిందీ టెలివిజన్‌ షోలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన మేనల్లుడి పెళ్లి కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ 74 ఏళ్ల నటి.. తన మేనల్లుడి కోసం అమృత్ విస్కీ బాటిల్‌ను (Amrut whiskey) బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే విస్కీ డెలివరీ చేయించుకోవాలని.. వైన్ స్టోర్‌ల కాంటాక్ట్‌ నెంబర్ల కోసం ఆమె గూగుల్‌లో వెతికింది. అయితే అదే ఆమె చేసిన పెద్ద తప్పిదం అయింది. ఆమె ఆన్‌లైన్‌లో తనకు లభించిన నెంబర్‌కు కాల్ చేసింది. అవతల ఫోన్ చేసిన వ్యక్తి తనను వైన్ స్టోర్‌లో ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. 

ఈ క్రమంలోనే ఆమె ఫోన్ ద్వారానే విస్కీ ఆర్డర్ చేసింది. ఇందుకోసం ఆమె రూ. 4,800 చెల్లించింది. అయితే విస్కీ బాటిల్‌ మాత్రం డెలివరీ కాలేదు. దీంతో ఆమె తాను తొలుత ఫోన్ చేసిన నెంబర్‌కు కాల్ చేసింది. విస్కీ బాటిల్‌ డెలివరీ కానందున.. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరింది. అయితే అవతలి వ్యక్తి డబ్బు తిరిగి పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాప్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపాడు. 

అయితే ఆ మాటలు నిజమని నమ్మిన నటి.. అవతలి వ్యక్తి చెప్పినట్టుగా చేసింది. తన డెబిట్ కార్డు (debit card) వివరాలను తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమెకు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వచ్చింది. అయితే డబ్బును తిరిగి చెల్లించడానికి ఆ ఓటీపీ చెప్పాలని ఆమెను అవతలి వ్యక్తి కోరాడు. దీంతో ఆమె ఓటీపీ వివరాలను చెప్పేసింది. దీంతో వెంటవెంటనే ఆమె అకౌంట్‌ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డెబిట్ అయ్యాయి. 

ఆ తర్వాత కూడా అవతలి వ్యక్తి మరోసారి ఆమెను మోసం చేశాడు. నటి డెబిట్ కార్డులో సాంకేతిక సమస్య ఉందని చెప్పి నమ్మించాడు. అనంతరం ఆమె క్రెడిట్ కార్డు వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత ముందు మాదిరిగానే ఓటీపీ వివరాలను సేకరించాడు. దీంతో అందులో నుంచి అమౌంట్ కట్ అయింది. ఇలా మొత్తంగా అతడు.. రూ. 3.05 లక్షలను నటి నుంచి దొంగిలించాడు (duped Rs 3 lakh). ఆ తర్వాత నటి ఎన్నిసార్లు అతనికి కాల్ చేసిన సమాధానం రాలేదు. కొన్ని గంటల తర్వాత అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నటి.. పోలీసులను ఆశ్రయించింది. 

74 ఏళ్ల నటుడు ఆ వ్యక్తికి చాలాసార్లు కాల్ చేశాడు, కానీ ఆమె కాల్‌లకు సమాధానం రాలేదు. అనంతరం తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తాను రూ. 3.05 లక్షలు మోసపోయినట్టుగా శివాజి పార్క్ పోలీస్ స్టేషన్‌లో (shivaji park police station) ఫిర్యాదు చేసింది. 

click me!