
ఈరోజు ఎపిసోడ్ లో తులసి దేవుడికి హారతి ఇచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నందు కింద కూర్చుని తులసికి ధైర్యం చెప్పాలి అనుకుంటుండగా వద్దు మీరు నాకు ధైర్యం చెప్పాలి అనుకుంటున్నారు కదా అనగా ఇంతలో పరందామయ్యా నీకెందుకు అమ్మ అంత భయంగా ఉంది అనడంతో ఏమో తెలియదు మామయ్య మనసులో ఏదో తెలియని అనుమానం అంటుంది తులసి. కేఫ్ ని కన్నబిడ్డలా చూసుకుంటున్నావు. కీర్తి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గానే మాట్లాడుకున్నారు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు తులసి అంటాడు నందు.
నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా చెప్పు తులసి అని నందు అనడంతో వెంటనే అనసూయ మనసులో ఏముందో బయటపెట్టు తులసి అంటుంది. అప్పుడు ప్రేమ్ అమ్మ చేసిన పూజలు చాలు నీ నిజాయితీ ఏంటో ఆ దేవుడికి తెలుసు అని అంటాడు. అంతా మంచే జరుగుతుంది వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అనడంతో అవును తులసి పండగ రోజు నువ్వు ఇలా దిగాలుగా ఉండడం అసలు బాగోలేదు అంటాడు నందు. లేదు నాకు ఆ దేవుడు పెడుతున్న పరీక్ష మీరందరూ వెళ్లి పడుకోండి నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంది తులసి. అప్పుడు అందరూ టెన్షన్ పడుతూ ఉండగా నందు వెళ్లి తులసి కోసం కాఫీ తీసుకుని వస్తాడు. నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నాను నేను ఏమి తీసుకోను అని అంటుంది తులసి.
అప్పుడు నందు కూడా కాఫీ తాగకుండా పక్కన కూర్చోవడంతో అదేంటి అనగా నువ్వు కేఫీ కోసం దీక్షలో ఉన్నావు నేను నీకోసం ఉన్నాను. పూజ కానివ్వు అంటాడు నందు. అప్పుడు అందరూ అక్కడ అలాగే కూర్చుని నిద్రపోతూ ఉండగా తులసి మాత్రం తెల్లవార్లు దేవుడికి పూజ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత తెల్లవారగా రాత్రంతా అలాగే ఉన్నావు నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావా తులసి అంటాడు పరంధామయ్య. అదేం లేదు మామయ్య అని అంటుంది తులసి. అప్పుడు తులసి బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొద్ది సేపట్లో ఆ దేవుడు నా జీవితాన్ని డిసైడ్ చేయబోతున్నాడు అనడంతో ఎందుకు ఇంత మొండితనం తులసి కేఫ్ ఏ విషయంలో నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అంటాడు నందు.
అప్పుడు నందు నేను కేఫ్ పెట్టకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా అనగా తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు అభి అతనికి ఫోన్ చేద్దాము అనడంతో ఎవరు ఎవరికి ఫోన్ చేయవద్దు రిపోర్టు వచ్చేవరకు వెయిట్ చేద్దాం అని అంటుంది తులసి. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు. రిపోర్టు వచ్చిందా అనుకున్నంత అయిపోయిందా అని సంతోషంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు కాస్త మంచిగా మాట్లాడొచ్చు కదా అని నందు అనడంతో లాస్య మాత్రం నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ దాన్ని నువ్వు కదిలించకురా దానిమీద కదిలిస్తే బురదలో రాయి వేసి నట్లే అని అంటుంది.
ప్రేమ్ నాన్న మెయిల్ వచ్చింది అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నెట్ స్లో గా ఉండడంతో ఇంట్లో అందరూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు అమ్మ మెయిల్ వచ్చింది. అమ్మ కేఫ్ కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు తులసి సంతోషంతో హారతి ఇవ్వగా అందరూ సంతోషంతో కళ్ళకి హత్తుకుంటారు. అప్పుడు నందు ఈ సమస్య నుంచి బయటపడ్డామంటే అందుకు నీ పూజలే కారణం తులసి అవే ఈరోజు మనల్ని బయటపడేసాయి అంటాడు నందు.
అవునమ్మా తులసి నీ పూజలే ఈ సమస్య నుంచి బయట పడేసాయి అనడంతో అప్పుడు లాస్య అంతే ఈ ఇంట్లో ఏ మంచి జరిగినా అంతా తులసి వల్లే జరిగింది అంటారు ఈ ఇంట్లో అందరికీ చేతబడి చేసింది అనడంతో నందు లాస్య అని కోపంగా అరిచి లాస్యను కొట్టడానికి చేయి లేపుతాడు. నిన్ను కొట్టడానికి సిగ్గుగా ఉంది నిన్నటి నుంచి నీ మీద కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను పిల్లల ముందు కొట్టాలి అని ఆగుతున్నాను అంటాడు నందు. మరి నేను అన్నదాంట్లో తప్పేముంది నందు అనడంతో ప్రతిదానికి నువ్వు తులసిని నిందించడం లేదా. రిపోర్ట్ పాజిటివ్గా రావాలని రాత్రంతా జాగారం చేసింది తులసి కానీ నువ్వు ఫుల్ గా తిని పడుకుని నిద్రపోయావు.
ఇప్పుడు అర్థమైందా మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు లాస్య అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అందరూ కలిసి తులసిని పూజ నుంచి పైకి లేచి రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఆ తర్వాత గాయత్రి కోపంగా చందు కి ఫోన్ చేస్తుంది. నమ్మకద్రోహి డబ్బులు ఇప్పించుకొని మోసం చేస్తావా, ఎందుకురా చెప్పిన పని చేయలేదు అనడంతో అప్పుడు చందు జరిగింది మొత్తం గాయత్రికి వివరిస్తాడు. మా అమ్మని కాపాడిన దేవత తులసి మేడం అనడంతో ఆ డబ్బులు ఏవో నన్ను అడిగితే నీ మొఖాన విసిరి కొట్టే దాన్ని కదా గాయత్రి అనగా అని తులసి మేడం ప్రేమగా చేతిలో పెట్టింది అంటాడు చందు. పైగా మీది పాపిష్టి డబ్బు ఆ డబ్బు తీసుకొని మా అమ్మకు ట్రీట్మెంట్ చేయించిన బతికేది కాదేమో అని అంటాడు.
దేవత లాంటి తులసి మేడమ్ కి వెన్నుపోటు పొడవడం తప్పనిపించింది అందుకే ఇలా చేశాను అంటాడు. అప్పుడు గాయత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు అభి అంకిత ఇంట్లో వాళ్ళందరికీ మేము అమెరికాకు వెళ్తున్నాము టికెట్స్ బుక్ అయ్యాయి అనగా వెంటనే తులసి కొద్ది రోజులు ఉండొచ్చు కదా అంకితం నువ్వైనా చెప్పు అనడంతో లేదంటే టికెట్స్ బుక్ అయ్యాయి వెంటనే వెళ్లాలి అని అంటుంది. వాళ్ళు ఎప్పటికైనా అమెరికాకు వెళ్లాల్సిందే కదా తులసి అప్పుడైనా బాధపడాల్సిందే కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది అంటాడు పరంధామయ్య.. అప్పుడు ఎవరు బాధపడకండి వెళ్లే ముందు పెద్ద పార్టీ చేసుకుందాం అంటుంది శృతి.
ఆ తర్వాత నందు లాస్య కేఫ్ కి వెళ్ళగా అప్పుడు నందు సంతోషంతో అక్కడ పనులు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య ఈ సంతోషమంతా ఎందుకు నందు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అన్న ఆనందమా లేక తులసికి దగ్గరవుతున్నావన్న ఆనందమా అని అంటుంది. నువ్వు మనశ్శాంతిగా ఉండవు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని అంటాడు. అప్పుడు లాస్య ఎందుకో కానీ తులసి నీ దగ్గర అవసరానికి మించి చనువుగా ఉందేమో అనిపిస్తుంది అని అంటుంది. అలాంటిది ఏమీ లేదు అంటే నమ్మవు అప్పుడు నేను ఏం చేయాలి అని అంటాడు నందు.