దర్శకుడిగా టాలీవుడ్ లో స్టార్ డమ్ ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త అవతారం ఎత్తారు. నిర్మాతగా మారి వరుస సినిమాలు రూపొందించబోతున్నారు. త్రివిక్రమ్ లిస్ట్ లో స్టార్ హీరోలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కొత్తగాప్రొడ్యూస్ అవతారం ఎత్తారు. డైలాగ్ రైటర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి, మాటల మాత్రికుడు అన్న బిరుదు కూడా సంపాధించిన త్రివిక్రమ్... ఆ తరువాత దర్శకుడిగా మారిపోయారు. కథ రాసుకోవడం.. స్క్రీన్ ప్లే సెట్ చేసుకోండంతో పాటు... తన మార్క్ డైలాగ్స్ తో ఎన్నో సినిమాలను సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు త్రివిక్రమ్(Trivikram Srinivas). తన ఆస్థాన నిర్మాతలైన చినబాబు - నాగవంశీ లతో 'జులాయి' మూవీ దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్.. ఇఫ్పుడు తానే స్వయంగా నిర్మాతగా మారిపోయారు.
ఇక త్రివిక్రమ్ స్వయంగా సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. అది కూడా ఒక మాదిరి బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. వెంటనే 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' పేరుతో ఒక సొంత బ్యానర్ ను ఎర్పాటు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas). తన భార్య సౌజన్య ఈ సంస్థకు సంబంధించిన పనులు చూసుకుంటారని తెలుస్తోంది. ఇక పెద్ద పెద్ద బ్యానర్లతో భాగస్వామిగా కూడా సినిమాలు నిర్మించబోతున్నారు మాటల మాంత్రికుడు.
అందులో భాగంగానే ధనుష్(Dhanush) - వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీలో భాగస్వామి అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమాకు “సార్” అని టైటిల్ ఫిక్స్ చేశారు. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నిర్మాతలుగా నాగవంశీ పేరుతో పాటు, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య పేరు, 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' లోగో కూడా కనిపించింది. త్వరలోనే ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' బ్యానర్ లో మీడియం బడ్జెట్ సినిమాలు కూడా త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నారు.రీసెంట్ గా ఓ ప్రాజక్ట్ కూడా కన్ పార్మ్ చేశారు. యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా.. కల్యాణ్ శంకర్ అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఓ సినిమా ప్లాన్ చేశారు. వీటితో పాటు మరికొంత మంది మిడిల్ క్లాస్ హీరోలతో త్రివిక్రమ్ సినామలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read : Shyam Singha Roy Movie Review: శ్యామ్ సింగరాయ్ ట్విట్టర్ టాక్.
వీటితో పాటు స్టార్ హీరోల సినిమాల నిర్మాణం విషయంలో కూడా త్రివిక్రమ్(Trivikram Srinivas) నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. బడా నిర్మాతలతో కలిసి పెద్ద సినిమాలలో భాగస్వామి అవ్వాలని ప్రతయ్నం చేస్తున్నట్టు సమాచారం. నిర్మాతలు చినబాబు, నాగవంశీలతో కలిసి నడవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ టాక్. వీరు సినిమాలు చేయబోయే హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వీరిని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్.. నిర్మాతగా వీరి సినిమాలు తెరకెక్కించబోతున్నారు.