Radhe Shyam pre release event:ఇద్దరికీ చెడిన మాట వాస్తవమేనా... ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా

Published : Dec 24, 2021, 07:56 AM ISTUpdated : Dec 24, 2021, 08:01 AM IST
Radhe Shyam pre release event:ఇద్దరికీ చెడిన మాట వాస్తవమేనా... ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా

సారాంశం

రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో పూజా హెగ్డే (Pooja hegde), ప్రభాస్ ఎవరి దారి వారిదే అన్నట్లున్నారు. వీరి మధ్య ప్రేమపూర్వక సంభాషణ చోటు చేసుకోలేదు. ఫార్మాలిటీ కోసం హాయ్... బాయ్ చెప్పుకున్నారు. 

రాధే శ్యామ్ మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రభాస్ కి గొడవైందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. సెట్స్ లో పూజా యాటిట్యూడ్ నచ్చని ప్రభాస్ ఆమెపై కోప్పడ్డారని వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ లో నిజం లేదని చిత్ర యూనిట్ స్వయంగా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే ప్రచారం జరిగినట్లు ప్రభాస్ పూజా హెగ్డేలకు చెడిందా?... ఇద్దరూ గొడవ పడ్డారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

డిసెంబర్ 23న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Radhe Shyam pre release event)ఘనంగా జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు హాజరయ్యారు. నేషనల్ ఈవెంట్ గా సాగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ (Radhe shyam trailer)విడుదలైంది. ప్యూర్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 

కాగా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో పూజా హెగ్డే (Pooja hegde), ప్రభాస్ ఎవరి దారి వారిదే అన్నట్లున్నారు. వీరి మధ్య ప్రేమపూర్వక సంభాషణ చోటు చేసుకోలేదు. ఫార్మాలిటీ కోసం హాయ్... బాయ్ చెప్పుకున్నారు. ఒకరిపై ఒకరికి అభిమానం, గౌరవం కనిపించలేదు. ఈవెంట్ మొత్తం పెద్దగా మాట్లాడుకోలేదు. వేదికపై మాట్లాడేప్పుడు సైతం ఒకరి గురించి మరొకరు మాట్లాడింది తక్కువే. ఏదో పొడిపొడిగా యూనిట్ సభ్యుల పేర్లతో పాటు పూజా పేరు ప్రభాస్, ప్రభాస్ పేరు పూజా పలికారు. 

Also read Radhe Shyam: ఊహించని ట్విస్ట్ లు, క్లైమాక్స్ అదిరిపోతుంది.. ప్రభాస్
పూజా అయితే కనీసం డైరెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్ కూడా ప్రభాస్ కి ఇవ్వలేదు. రాధాకృష్ణ గురించి మాత్రమే ఆమె మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఇవన్నీ గమనిస్తే.. ప్రచారమైన మీడియా కథనాలు నిజమే అనిపిస్తుంది. సెట్స్ కి టైం కి రాకపోవడంతో ప్రభాస్ ఆమెపై అసహనం వ్యక్తం చేశారట. అలా ప్రభాస్ (Prabhas)కోపానికి పూజా కారణమయ్యారట. ప్రభాస్ తో పనిచేసే హీరోయిన్ ఎవరైనా ఆయన ఆతిధ్యానికి పడిపోతారు. ఒక్క పూజా హెగ్డే విషయంలోనే ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. 

Also read Radhe Shyam prerelease event:ఓ కొత్త ప్రభాస్.. పూజాలను రాధే శ్యామ్ లో చూస్తారు
కాగా రాధే శ్యామ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, జగపతి బాబు వంటి నటులు రాధే శ్యామ్ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రాధే శ్యామ్ తెరకెక్కించారు. ఐదు భాషల్లో రాధే శ్యామ్ విడుదల కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: అసలు ప్రభాస్ ఎవరు ? నాకు చిరంజీవి, చీను భర్త మాత్రమే తెలుసు.. స్టార్ హీరోకి ఫ్యూజులు ఎగిరిపోయాయి
IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?