Susmita Sen : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్

Published : Dec 24, 2021, 08:41 AM IST
Susmita Sen : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్

సారాంశం

మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ (Susmita Sen) ఫ్యాన్స్, మీడియా వర్గాలకు షాక్ ఇచ్చారు. ఆమె తన ప్రియుడు రోహ్మన్ షాల్ తో బ్రేకప్ అవుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. 

43 ఏళ్ల సుస్మితా సేన్ దాదాపు నాలుగేళ్లుగా మోడల్ రోహ్మన్ షాల్ తో డేటింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వీరి రిలేషన్ కి బీజం పడింది. ఇంస్టాగ్రామ్ లో రొహ్మన్ షాల్ సుస్మితా సేన్ కి డైరెక్ట్ మెసేజ్ చేశారు. సింగిల్ గా ఉన్న సుస్మితా సేన్ రోహ్మన్ సందేశానికి స్పందించారు. అప్పటి నుండి వీరి బంధం కొనసాగుతుంది. ఇద్దరూ భార్యభర్తలకు  ఏమాత్రం తీసిపోకుండా విందులు, విహారాలలో పాల్గొంటున్నారు. సుస్మితా సేన్ కంటే రోహ్మన్ 15 ఏళ్లు చిన్నవాడు కావడం ఈ బంధంలో ఉన్న మరో విశేషం. 

కాగా కొద్దిరోజులుగా సుస్మితా, రోహ్మన్  మధ్య విబేధాలు తలెత్తాయని, వీరు బ్రేకప్ కానున్నారని కథనాలు వెలువడుతున్నాయి. వాటిని నిజం చేస్తూ... సుస్మితా సేన్ అధికారిక ప్రకటన చేశారు. ‘మా ప్రయాణాన్ని స్నేహంతో ప్రారంభించాం. ఇప్పుడు స్నేహితులుగానే విడిపోతున్నాం. మా ఇద్దరి మధ్య అనుబంధం ముగిసింది. కానీ, ప్రేమ అలాగే ఉంది’ అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దీంతో సుస్మితా-రోహ్మన్  బ్రేకప్ అధికారికమేనన్న స్పష్టత వచ్చింది. 

సుస్మితా సేన్-రోహ్మన్ బ్రేకప్ కి కారణాలు తెలియాల్సి ఉంది. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్న సుస్మితా సేన్ వివాహం చేసుకోలేదు. ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. 2000 సంవత్సరంలో రీనీ, 2010 లో అలీషా అనే చిన్నారిని ఆమె అడాప్ట్ చేసుకున్నారు. 

Also read Allu Sneha: అల్లు అర్జున్ భార్యపై సమంత హాట్ కామెంట్స్.. బ్లాక్ శారీలో అల్లు స్నేహ గ్లామర్ మెరుపులు
1996లో విడుదలైన దస్తక్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె నాగార్జునకు జంటగా రక్షకుడు మూవీలో నటించారు. ప్రస్తుతం సుస్మితా సేన్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఆర్య, ఆర్య 2 సిరీస్లలో సుస్మితా లీడ్ రోల్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్