ఎన్టీఆర్ ప్లాప్ సినిమాల గురించి త్రివిక్రమ్ కామెంట్!

Published : Oct 17, 2018, 08:07 PM IST
ఎన్టీఆర్ ప్లాప్ సినిమాల గురించి త్రివిక్రమ్ కామెంట్!

సారాంశం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ను స్ట్రాంగ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు కొంచెం స్లోగా వెళుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ను స్ట్రాంగ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు కొంచెం స్లోగా వెళుతోంది. ఈ వారంలో వచ్చే కలెక్షన్స్ బట్టి సినిమా కమర్షియల్ హిట్ అందుకుంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ రానుంది. 

ఇకపోతే మొదటి సారి ఎన్టీఆర్ తో వర్క్ చేసిన త్రివిక్రమ్ తనదైన శైలిలో పొగుడుతూ వస్తున్నారు. సక్సెస్ మీట్ లో తారక్ ను సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చిన త్రివిక్రమ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అపజయాల గురించి కూడా మాట్లాడాడు. అయితే ఆయన సినిమాల గురించి ప్రస్తావించలేదు గాని తారక్ నటనను హైలెట్ చేస్తూ మాట్లాడారు. 

ఎన్టీఆర్ గత చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ అతను నటనలో ఎప్పుడు ఫెయిలవ్వలేదని ప్రశంసించారు. అదే విధంగా సినిమా రిజల్ట్ లో ఎంత తేడా ఉన్నా డ్యాన్స్ -ఫైట్స్ మరియు కామెడీ లలో తన బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడని తెలుపుతూ అరవింద సమేతలో తన నటనతో ఆడియెన్స్ ని థియేటర్స్ వరకు రప్పిస్తున్నట్లు త్రివిక్రమ్ వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?