నానిని ఏఎన్నార్ తో పోల్చశారుగా!

Published : Oct 17, 2018, 07:05 PM IST
నానిని ఏఎన్నార్ తో పోల్చశారుగా!

సారాంశం

నాగార్జున - నాని కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం దేవదాసు. యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ ను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. 

నాగార్జున - నాని కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం దేవదాసు. యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ ను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. 

సినిమాకు ఇంతటి ఘనవిజయాన్ని అందించినందుకు మొదట ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు అశ్వినీదత్. అయితే నాగార్జున ఎవరు ఊహించని విధంగా నానిని పొగిడారు. మెయిన్ గా లెజెండ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరా రావుతో నాని పోల్చడం అందరిని ఆకర్షించింది. నాని యాక్టింగ్ చుసిన తరువాత నాన్న గారు అప్పట్లో న్యాచురల్ గా నటించిన విధానం గుర్తుకొస్తోందని అన్నారు. 

అదే విధంగా నానితో ఇంకా వర్క్ చేయాలనీ అనిపిస్తోందని ఎప్పుడు కుదిరినా మరో సినిమా చేయడానికి సిద్ధమని అన్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో రష్మిక మందాన - ఆకాంక్ష కథానాయికలుగా కనిపించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో