తుపాను బాధితుల కోసం బాలయ్య విరాళం!

Published : Oct 17, 2018, 06:14 PM IST
తుపాను బాధితుల కోసం బాలయ్య విరాళం!

సారాంశం

తుపాను వలన నష్టపోయిన వారికోసం ఇప్పుడిపుడే సెలబ్రెటీలు సహాయాన్ని అందించడం మొదలుపెట్టారు. అందరికంటే ముందుగా సంపూర్ణేష్ బాబు తనవంతు సహాయాన్ని అందించగా మిగతా స్టార్ నటీనటులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా విరాళాలను పంపించారు. 

ఆంధ్రప్రదేశ్ లోని నార్త్ ప్రజలను తితలీ తుపాను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం వాసులు ఈ తుపాను వలన ఎక్కువగా నష్టపోయారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయనగరం వాసులను కూడా వాతావరణం భయానికి గురి చేస్తోంది. అయితే తుపాను వలన నష్టపోయిన వారికోసం ఇప్పుడిపుడే సెలబ్రెటీలు సహాయాన్ని అందించడం మొదలుపెట్టారు. 

అందరికంటే ముందుగా సంపూర్ణేష్ బాబు తనవంతు సహాయాన్ని అందించగా మిగతా స్టార్ నటీనటులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా విరాళాలను పంపించారు. విజయ్ దేవరకొండ -  నిఖిల్ మరియు ఆర్ఎక్స్ 100 హీరో కూడా ఫండ్స్ ఇవ్వగా రీసెంట్ గా నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్ - తారక్ కూడా వారి వంతు సహాయాన్ని అందించారు. 

ఇకపోతే ఇప్పుడు సినీనటుడు రాజకీయనాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా తితలీ తుపాను బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతో టాలీవుడ్ లో ఏపిని ఆదుకోవడానికి మరికొందరు సెలబ్రెటీలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?