చిరు సినిమాకి అప్పుడు హ్యాండిచ్చి.. ఇప్పుడు ఓకే చెప్పిన త్రిష..?

Published : Feb 22, 2021, 02:00 PM IST
చిరు సినిమాకి అప్పుడు హ్యాండిచ్చి.. ఇప్పుడు ఓకే చెప్పిన త్రిష..?

సారాంశం

చిరంజీవి హీరోగా `లూసిఫర్‌` రీమేక్‌ని తమిళ దర్శకుడు మోహన్‌రాజా రూపొందిస్తున్నారు. ఇది ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఉండదు. ఈ లెక్కన చిరంజీవి సరసన హీరోయిన్‌ లేదనే చెప్పాలి. కానీ చెల్లి పాత్ర చాలా బలంగా, కీలకంగా ఉంటుంది. 

చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో హీరోయిన్‌గా ముందుగా త్రిషని ఫైనల్‌ చేశారు. దాదాపు ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంది త్రిష. అయితే తాజాగా ఆమె ఓకే చెప్పిందట. `లూసిఫర్‌` రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. చిరంజీవి హీరోగా `లూసిఫర్‌` రీమేక్‌ని తమిళ దర్శకుడు మోహన్‌రాజా రూపొందిస్తున్నారు. ఇది ఇటీవల ప్రారంభమైంది. 

ఈ చిత్రంలో హీరోయిన్‌ ఉండదు. ఈ లెక్కన చిరంజీవి సరసన హీరోయిన్‌ లేదనే చెప్పాలి. కానీ చెల్లి పాత్ర చాలా బలంగా, కీలకంగా ఉంటుంది. చెల్లి పాత్రలో నటించేందుకు త్రిష ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా చెల్లి పాత్రకి విజయశాంతిని అడిగారు. చిరంజీవితో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి డ్యూయెట్లు పాడిన విజయశాంతి, చిరుకి చెల్లిగా నటించేందుకు నో చెప్పేసిందట. 

దీంతో నయనతారని సంప్రదించారు. ఇప్పటికే `సైరా`లో చిరంజీవి సరసన నటించింది నయనతార. ఆమె కూడా చిరంజీవికి చెల్లిగా నటించేందుకు ఒప్పుకోలేదట. దీంతో చివరికి త్రిషని సంప్రదించగా,చిరంజీవికి చెల్లిగా నటించేందుకు అంగీకరించిందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే `స్టాలిన్‌` చిత్రంలో చిరు సరసన త్రిష ఆడిపాడిన విషయం తెలిసిందే. త్రిష ప్రస్తుతం `పరమపదమ్‌ విలయట్టు`,`గర్జనై`, `సథురంగ వెట్టై 2`, `రాంగి`, `సుగర్‌`, `రామ్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు