కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేటః `సీటీమార్‌` టీజర్‌

Published : Feb 22, 2021, 10:54 AM IST
కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేటః `సీటీమార్‌` టీజర్‌

సారాంశం

`కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట..` అంటున్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం `సీటీమార్‌`. తమన్నా హీరోయిన్‌గా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని నేడు(సోమవారం) విడుదల చేశారు.

`కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట..` అంటున్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం `సీటీమార్‌`. తమన్నా హీరోయిన్‌గా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని నేడు(సోమవారం) విడుదల చేశారు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ఆంధ్ర మహిళా కబడ్డీ టీమ్‌ కెప్టెన్‌గా గోపీచంద్‌, తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్‌ కెప్టెన్‌గా తమన్నా నటిస్తున్నారు. 

తాజాగా విడుదలైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. విలన్‌ పాత్రదారి `కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. `అని గాంభీర్యంగా అరవగా, గోపీచంద్‌ ఎంట్రీ ఇవ్వడం, గ్రౌండ్‌లో కబడ్డీ సన్నివేశాలు. విలన్లని గోపీచంద్‌ మట్టుపెట్టించడం ఈ క్రమంలో `కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట` అనే డైలాగ్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సినిమాపై ఈ టీజర్‌ ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. స్పోర్ట్స్ లోని రాజకీయాలు, కబడ్డీని కొందరు ఎలా శాషిస్తున్నారు అనే అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై సినిమా తెరకెక్కుతుంది.  ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌