బాలకృష్ణ సినిమాని అడ్డుకున్న గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?

Published : Feb 22, 2021, 01:12 PM IST
బాలకృష్ణ సినిమాని అడ్డుకున్న గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?

సారాంశం

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. `బీబీ3` అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ని వికారాబాద్‌ మండలం కోటాల గుడెంలో జరిపేందుకు అక్కడికి వెళ్లింది యూనిట్‌. షూటింగ్‌ల వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అడ్డుకున్నారు.

బాలకృష్ణ సినిమాకి అడ్డంకి ఎదురైంది. సినిమా షూటింగ్‌ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సినిమా షూటింగ్‌ వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు చిత్ర షూటింగ్‌ని అడ్డుకోవడంతో షూటింగ్‌ ఆగిపోయింది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. `బీబీ3` అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ని వికారాబాద్‌ మండలం కోటాల గుడెంలో జరిపేందుకు అక్కడికి వెళ్లింది యూనిట్‌. షూటింగ్‌ల వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో మరో లొకేషన్‌ వెతికే పనిలో చిత్ర బృందం పడింది. 

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి `గాడ్‌ఫాదర్‌` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఆద్యంతం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా సాగుతుందని, కథకి తగ్గట్టుగా ఈ టైటిల్‌ని ఖరారు చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. దీనికి సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా మే 28న విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే