
దాదాపు దశాబ్దంపాటు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించింది చెన్నై బ్యూటీ త్రిష. ఇక, కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. ఓ వ్యాపారవేత్తతో పెళ్లి సెటిలయి, నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే ఏమైందో, ఏమో పెళ్లి పీటలు కూడా ఎక్కక ముందే ఆ వ్యవహారం ముగిసిపోయింది.
మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవల ఆమె ధనుష్ సరసన నటించిన ‘కోడి’ (తెలుగులో ధర్మయోగి) మంచి విజయం సాధించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో త్రిష తన పెళ్లి గురించి చెప్పింది. ‘నేను నటిగా కొనసాగడానికి ఒప్పుకోనందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా. నేను ప్రెగ్నెంట్ అయినపుడు కూడా కొన్ని నెలల గ్యాప్ మాత్రమే తీసుకుంటా. హీరోయిన్ వేషాలు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతాను. దీనికి ఒప్పుకోనందుకే ఓ వ్యక్తితో తెగదెంపులు చేసుకున్నా. చనిపోయేవరకు నటిస్తూనే ఉంటా. దీనికి అంగీకరించినవాడితోనే పెళ్లిపీటలు ఎక్కుతానని చెప్పింది.