`హెరా ఫెరీ 3` నుంచి పరేష్‌ రావల్‌ తప్పుకోవడంపై అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్ టైమ్‌ స్పందించారు.. ఏమన్నారంటే?

Published : May 27, 2025, 10:10 PM IST
paresh rawal, akshay kumar

సారాంశం

సీనియర్‌ నటుడు పరేష్ రావల్ `హెరా ఫెరీ 3`  సినిమా నుంచి  వైదొలిగిన విషయం తెలిసిందే.  దీంతో పరేష్‌ రావల్‌పై అక్షయ్ కుమార్ పరువునష్టం దావా వేసిన  నేపథ్యంలో, `హౌస్ ఫుల్ 5 `ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ వివాదంపై స్పందించారు.

అక్షయ్ కుమార్ `హెరా ఫెరీ 3` వివాదంపై స్పందించారు.  పరేష్ రావల్ ఇటీవల `హెరా ఫెరీ 3` సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.  దీంతో పరేష్ రావల్‌ అభిమానులతోపాటు సినీ వర్గాలు సైతం షాక్‌కి గురయ్యారు.  

ఈ వివాదంలో అక్షయ్ కుమార్.. పరేష్ రావల్ పై 25 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. అయితే, ఇప్పటివరకు అక్షయ్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడలేదు, కానీ `హౌస్ ఫుల్ 5` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దీని గురించి ఓపెన్‌ అయ్యారు.  

అక్షయ్ కుమార్ ఫస్ట్ టైమ్‌ రియాక్షన్‌..   

నా కోస్టార్‌ని 'మూర్ఖుడు' అని పిలవడం సరికాదు. నేను దీన్ని సమర్ధించను. ఆయనతో 30-32 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన్ని చాలా గౌరవిస్తాను. ఇది చాలా సీరియస్ విషయం, కోర్టులో దీనికి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ దీని గురించి మాట్లాడటం సరికాదు అని తెలిపారు అక్షయ్‌.  

ప్రియదర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నారట

'హెరా ఫెరీ 3' కోసం పరేష్ ఒప్పందంపై సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు, కానీ ఆ తర్వాత ఆయన మరింత పారితోషికం కోరారు. నిర్మాతలు ఆయన డిమాండ్ కు ఒప్పుకోలేదు, దీంతో సినిమాలో నటించడానికి నిరాకరించారు. ఈ వార్త విన్న దర్శకుడు ప్రియదర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నారట. సునీల్ శెట్టి కూడా ఈ వార్త విని షాక్‌ అయ్యారట.

 `హెరాఫెరీ` సినిమా మొదటి రెండు భాగాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. కానీ ఇలా పరేష్‌ రావల్ తప్పుకోవడం ఇప్పుడు వివాదంగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?