
తమిళ స్టార్ హీరో.. రాజకీయ నాయకుడు,విప్లవ వీరుడు కెప్టెన్ విజయ్ కాంత్ కు అభిమానులు కన్నీటి వీడ్కోలు అర్పింస్తుండగా.. ప్రధాని నుంచి సినిమా తారల వరకూ సెలబ్రిటీలు కూడా విజయ్ మరణంపై సంతాపాలు ప్రకటిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు తమిళ స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్. ఆయన మరణంతో తమిళనాట అభిమానులు గుండెలు బరువెక్కాయి. కళ్ళు ఏకధార కాగా.. తమ నాయకుడిని.. అభిమాను హీరోను తలుచుకునికన్నీరు మున్నీరు అవుతున్నారు అభిమానులు. సినిమా హీరోగా.. రాజకీయ నాయకుడిగా తిరుగులేని ఇమేజ్ ను సాధించిన విజయ్ కాంత్ కు దేశవ్యాప్తంగా సెలబ్రిటీల నుంచి సంతాపాలువ్యాక్తం అవుతున్నాయి.
విజయ్ కాంత్ కుటుంబానికి సినీ రాజకీయ ప్రముఖులు ఓదార్పునిస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా కెప్టెన్ కు నివాళి అర్పిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రాల సీఎంల తో పాటు లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్, ఎన్టీఆర్, రవితేజ, విశాల్, శరత్ కుమార్, మంచు విష్ణు లాంటి తారలెందరో సంతాపం ప్రకటించారు. ఇంక మరికొందరు తారలు నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.