
విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయి హిట్ అయ్యాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అప్పట్లో విజయ్ కాంత్ సినిమా డబ్బింగ్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడేవారు. దాదాపు అన్నీ సూపర్ హిట్టే. 1991 టైమ్ లో లో డైరెక్ట్ తెలుగు సినిమాలతో పోటీపడి మరి ఈయన డబ్బింగ్ సినిమాలు పోటీ పడేవి. చాలా మంది ఆయన్ను అప్పట్లో రజనీకాంత్ కు సోదరడు అనుకునేవారు. ఇక పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా విజయ్ కాంత్ మంచి పాపులారిటీ అందుకున్నారు. మరి విజయ్ కాంత్ నటించిన చిత్రాలు తెలుగులో డబ్బింగ్, రీమేక్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం.
విజయ్ కాంత్ నటించిన చాలా చిత్రాలు ఇక్కడ డబ్బింగ్ అయ్యినా వాటిల్లో పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్, సింధూరపు పువ్వు, నూరవ రోజు, క్షత్రియుడు వంటి సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. దాంతో విజయ్ కాంత్ మార్కెట్ డబుల్ అయ్యింది. హిందీలోకి ఆయన సినిమాలు డబ్ అయ్యేవి. ఆయన కథల ఎంపిక అలా ఉండేది. బి,సి సెంటర్లలో ఆయన సినిమాలకు ప్రత్యేక మార్కెట్ ఉండేది. విలేజ్ బేసెడ్ మాస్ ఫిల్మ్స్ కు ఒక టైమ్ లో విజయ్ కాంత్ కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవారు.
ఇక రీమేక్ లు విషయానికి వస్తే.... విజయ్ కాంత్ నటించిన సట్టం ఓరు ఇరుట్టరాయ్ సినిమా 1981లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే ఏడాది చట్టానికి కళ్ళు లేవు అనే టైటిల్ తో చిరంజీవి రీమేక్ చేశారు. అలాగే విజయ్ కాంత్ 1983 లో కన్నడలో నటించిన గెలువు నన్నదే చిత్ర కథను ఆధారంగా చేసుకుని.. 1984లో వెట్రి చేస్తే ...అదే దేవాంతకుడు చిత్రాలు రీమేక్ అయ్యాయి.
1984లో తమిళంలో నటించిన వైదేకి కాతిరంతల్ మూవీని తెలుగులో 1986లో మంచి మనసులు అనే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది.ఇక 1985లో విడుదలైన నానే రాజా నానే మంతిరి చిత్రాన్ని తెలుగులో నేనే రాజు నేనే మంత్రి టైటిల్తో 1987లో రీమీక్ చేశారు. ఇక అమ్మన్ కోయిల్ కిజక్కలే చిత్రాన్ని చిరంజీవి తో ఖైదీ నెంబర్ 786 అనే టైటిల్ తో రీమేక్ చేశారు.
1987లో వచ్చిన నినైవే ఓరు సంగీతం సినిమాను తెలుగులో దొంగ పెళ్లి అనే టైటిల్ తో 1988లో రిలీజ్ చేశారు ఇందులో కృష్ణ హీరో గా నటించారు. 1989లో వచ్చిన ఎన్ పరుషన్ తాన్ ఎనక్కు మట్టుమ్తాన్ సినిమాను తెలుగులో అదే ఏడాది నా మొగుడు నాకే సొంతం అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక ఈ చిత్రానికి హీరోగా మోహన్ బాబు నటించారు. 1992లో చిన్న గౌందర్ చిత్రాన్ని 1992లో చిన్న రాయుడు పేరిట రీమేక్ చేయడం జరిగింది ఇక ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు.
2000 సంవత్సరంలో వనతైపోళ అనే చిత్రాన్ని తెలుగులో అదే ఏడాది మా అన్నయ్య పేరిట రీమేక్ చేయడం జరిగింది ఇక ఇందులో హీరో రాజశేఖర్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2002లో రమణ అనే సినిమాను రీమేక్ చేస్తూ ఠాగూర్ సినిమాను తెరకెక్కించారు ఇక చిరంజీవి నటించిన ఈ సినిమా భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. 2004లో వచ్చిన యంగ్ అన్న చిత్రాన్ని కుషీ కుషీగా పేరిట రిలీజ్ చేశారు ఇందులో జగపతిబాబు హీరోగా నటించారు. ఇలా విజయ్ కాంత్ నటించిన చాలా చిత్రాలను తెలుగులోకి తీసుకు వచ్చారు.