బ్లాక్‌ బస్టర్‌ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే

Published : May 27, 2025, 11:26 PM IST
Tourist Family

సారాంశం

కోలీవుడ్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కూడా వచ్చింది. 

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సూపర్ హిట్

శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు, ఎం.ఎస్.భాస్కర్, రమేష్ తిలక్, కమలేష్, మిథున్ జయ్‌శంకర్ వంటి వారు నటించిన కోలీవుడ్‌ మూవీ  ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న రిలీజ్ అయిన ఈ సినిమాకి భారీ స్పందన వచ్చింది. డైరెక్టర్ అభిషాన్ జీవింద్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలంక నుంచి వలస వచ్చిన ఒక తమిళ కుటుంబం ఎదుర్కొనే సమస్యలని కామెడీ, ఎమోషన్స్ తో చూపించారు.

75 కోట్లు వసూలు చేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’

నాలుగు వారాలు దాటినా ఈ మూవీ ఇంకా థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రూ. 7 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మూడు వారాల్లోనే రూ.75 కోట్లు వసూలు చేసిందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ శుభవార్త రానే వచ్చింది.

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్

జూన్ 2న జియో హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో త్వరలోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఈ మూవీ అలరించబోతుందని చెప్పొచ్చు. మరి ఓటీటీలో దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే