Salaar Free Tickets : రేపే ‘సలార్’ ట్రైలర్.. అభిమానులకు బంపర్ ఆఫర్.! ఫ్రీగా టికెట్లు

Published : Nov 30, 2023, 03:04 PM ISTUpdated : Nov 30, 2023, 03:06 PM IST
Salaar Free Tickets  :  రేపే ‘సలార్’ ట్రైలర్.. అభిమానులకు బంపర్ ఆఫర్.! ఫ్రీగా టికెట్లు

సారాంశం

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’ నుంచి రేపే ట్రైలర్ విడుదల కాబోతోంది.  ఈ సందర్భంగా మేకర్స్ అభిమానులకు బంపర్ ఆఫర్ అందించారు. టికెట్లు ఫ్రీగా అందిస్తామని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఫొటోనూ షేర్ చేయడం నెట్టింటిని షేక్ చేస్తోంది. 

ఇరవై రెండు రోజుల్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Salaar Cease Fire ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం Salaar Trailer కోసం కండ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. రేపే సలార్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఎలక్షన్ హీట్ ఉండటంతో  టీమ్ ఆడియెన్స్ ఫోకస్ తమపై మరల్చేందుకు ఓ సాలిడ్ పిక్ ను నెట్టింట విడుదల చేశారు. దాంతో ట్రైలర్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. 

అయితే ఇప్పటికే సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1న సాయంత్రం 7:19 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  రేపే ట్రైలర్ రాబోతుండటంతో ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ ఫుల్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు. ఈక్రమంలో ఫ్యాన్స్ కు మేకర్స్ బంపర్ ఆఫర్ అందించారు. తాజాగా ప్రశాంత్ నీల్ - ప్రభాస్ సెట్స్ లో మాట్లాడుతున్న ఓ  ఎనర్జిటిక్ ఫొటోను అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ ఫొటోల్లో సాలిడ్ టైటిల్ చెప్పిన ఐదుగురికి సలార్ ఫ్రీ టికెట్స్ అందించనున్నట్టు అనౌన్స్ చేశారు. 

ఇప్పటికే అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన విధంగా ఓరేంజ్ లో క్యాప్షన్లు అయితే ఇస్తున్నారు. సలార్ ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెరగనున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా మొత్తం సలార్ ప్రచారాలే కనిపించనున్నాయి.  ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)   నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ప్రభాస్ సరసన తొలిసారిగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు విలన్ పాత్రలు పోషిస్తున్నారు.  రవి బర్రూర్ సంగీతం అందిస్తుండటం విశేషం. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?