#Dhootha కథ ఏంటి, పేపరు ముక్కలో భవిష్యత్ లింక్

Published : Nov 30, 2023, 02:48 PM ISTUpdated : Nov 30, 2023, 02:51 PM IST
   #Dhootha కథ ఏంటి, పేపరు ముక్కలో భవిష్యత్ లింక్

సారాంశం

 అక్కడ నుంచి చైతుకు కనపడే పేపరు ముక్కలో ఏదైతే ఉంటుందో అదే జరుగుతూంటుంది. భవిష్యత్ లో జరిగే సంఘటనలు తెలిసిన చైతు కుటుంబం కష్టాల్లో పడుతుంది.  


నాగచైతన్య లీడ్​ రోల్​లో తెరకెక్కిన వెబ్​సిరీస్​ 'దూత'. మిస్టరీ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సిరీస్​ ఈ రోజు రాత్రి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ లోగా  ఈ సీరిస్  ని హైదరాబాద్ లో  AMB Cinemas లో మీడియా వారికి స్పెషల్ ప్రీమియర్ షో వేసారు మూవీ మేకర్స్​.  ఈ షోకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.  చాలా బాగా తీసారని మెచ్చుకుంటున్నారు చూసినవాళ్లు.  చూసిన వాళ్లు చెప్పేదాన్ని బట్టి    ఈ 'దూత' ఓ సూపర్ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 

ప్రతీ ఎపిసోడ్  చాలా ఆసక్తికరంగా సాగింది. ఇందులో చైతూ ఓ మీడియా పర్శన్ గా కనిపిస్తారు. 'సమాచార్' అనే న్యూస్​ పేపర్​ కు ఎడిటర్ గా  ఆయన కనిపించారు. చైతూ ఓ రోజు రాత్రి వర్షంలో కుటుంబంతో కలిసి వెళ్తుంటే ఓ కాగితం ముక్క దొరుకుతుంది. ఆ పేపర్లో సాగర్ ..మరి కాసేపట్లో కారు ప్రమాదానికి గురి అవుతాడని, అయితే ఆ యాక్సిడెంట్ లో అతని కుక్క చనిపోబోతున్నట్లు ఉంటుంది. అదే జరుగుతుంది. అక్కడ నుంచి అతనికు కనపడే పేపరు ముక్కలో ఏదైతే ఉంటుందో అదే జరుగుతూంటుంది. భవిష్యత్ లో జరిగే సంఘటనలు తెలిసిన చైతు కుటుంబం కష్టాల్లో పడుతుంది.  

ఆ కాగితం అతను కు పంపే దూత ఎవరు...మరో ప్రక్క   నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్‌ పేపర్​లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనిపెడుతారు. ఆ హత్యల వెనకాల ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమంలో ఆయనపై ఓ నేరారోపణ పడుతుంది. అయితే వాటన్నింటికి భయపడకుండూ చైతూ సాహాయం చేసి మిస్టరీని కనుగునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆయన చేసిన సాహాసాలు ఎలాంటివి..? అసలు చైతూ మీద ఆ నేరం ఎందుకు పడుతుంది..? సాగ‌ర్ వ‌ర్మ క‌థ‌కీ, 1962లో స‌త్య‌మూర్తి (ప‌శుప‌తి) అనే జ‌ర్న‌లిస్టుకీ ఉన్న సంబంధం ఏమిటి?  చిక్కుల్లో పడిన ఒక ఎడిటర్ వాటి నుంచి బయటపడ్డారు అనేది తెలియాలంటే రేపటి దాకా  వేచి చూడాల్సిందే. 

 నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' లాంటి సినిమాలను తెరకెక్కించిన విక్రమ్‌ కె. కుమార్‌ ఈ 'దూత'ను రూపొందించారు. ఇందులో చైతూతో పాటు ప్రియ భవానీ శంకర్‌, పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. చైతూకి ఇది ఓ కొత్త ప్రయత్నం. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్​.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..