పోలింగ్ కేంద్రం వద్ద చిరంజీవి కామెడీ, మెగాస్టార్ కామెడీ టైమింగ్ అదుర్స్ అంటున్న అభిమానులు, ఇంతకీ ఏమంటున్నారంటే

By Mahesh JujjuriFirst Published Nov 30, 2023, 2:40 PM IST
Highlights

తెలంగాణాలో ఎలక్షన్ పోలింగ్ జోరుగాసాగుతోంది. ఉదయాన్నే సామాన్యులకంటే ముందే ఓటు వేయడానికి స్టార్లు బయలుదేరారు. ఈక్రమంలో మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈక్రమంలో పోలింగ్ బూతు వద్ద లైన్ లో చిరంజీవి కామెడీ డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ఈరోజు( నవంబర్ 30)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. సామాన్యులు చాలా లేట్ గా పోలింగ్ కేంద్రాలకు వస్తుంటే.. సినిమా సెలబ్రిటీలు మాత్రం ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఉదయం ఏడుగంటలకే మెగాస్టార్, ఎన్టీఆర్, వెంకటేష్.. అల్లు అర్జున్, రాజమౌళి లాంటి స్టార్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటుని వేసేందుకు పోలింగ్ బూత్ కి వచ్చారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారు. 

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కూతురు శ్రీజ కొణిదెల కూడా ఓటు వేయడానికి వచ్చారు. రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే అంతటి మెగాస్టార్ అయినా.. సాధారణ ప్రజలతో పాటు ఈ మెగా కుటుంబం కూడా లైన్ లో నిలబడి ఓటుని వేసి వచ్చారు. కాగా ఓటు వేసేందుకు లైన్ లో ఉన్న నిలబడి ఉన్న చిరంజీవిని ప్రశ్నించేందుకు ఒక మీడియా ప్రతినిధి వెళ్లారు. ఆ రిపోర్టర్ ఎన్నికలు గురించి చిరంజీవి ప్రశ్నించగా, మెగాస్టార్ బదులిస్తూ.. మౌనవ్రతంలో ఉన్నాను.. అంటూ  సమాధానం చెప్పారు. 

Latest Videos

ఉదయాన్నే కదిలిన సెలబ్రిటీలు, ఓటు వేసిన మెగాస్టార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ రాజమౌళి..

మాట్లాడుతూనే.. మౌన వ్రతం అంటూనే మెగాస్టార్ మాట్లాడుతూ సమాధానం చెప్పడంతో.. అంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక తన కామెడీ టైమింగ్ తో మరోసారి అందరిని ఆకట్టుకున్నారు చిరంజీవి. ఇక రిపోర్టర్ మరోసారి చిరంజీవిని మాట్లాడించే ప్రయత్నం చేయగా.. ఆయన మాత్రం మాట్లాడకుండా గొంతు బాగోలేదని చెప్పి ముందుకు కదిలారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాంతో మెగా అభిమానులు ఈ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. మన  మెగాస్టార్ కామెడీ టూమింగ్ మామూలుగా ఉండదు మరి అంటూ పొంగిపోతున్నారు. సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటు వేసిన చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ లో రానా, నానీ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్, కీరవాణి, రవితేజ, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, రామ్.  ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ ఓను హక్కును వినియోగించుకున్నారు. 
 

click me!