చిరంజీవి నివాసంలో కీలక భేటీ.. నాగ్, అల్లు అరవింద్, ఆర్.నారాయణమూర్తి..

pratap reddy   | Asianet News
Published : Aug 16, 2021, 02:57 PM IST
చిరంజీవి నివాసంలో కీలక భేటీ.. నాగ్, అల్లు అరవింద్, ఆర్.నారాయణమూర్తి..

సారాంశం

టాలీవుడ్ సమస్యల పరిష్కారం వైపు ఇండస్ట్రీ పెద్దలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సినీ పరిశ్రమ సమస్యలు చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ సమస్యల పరిష్కారం వైపు ఇండస్ట్రీ పెద్దలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సినీ పరిశ్రమ సమస్యలు చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. త్వరలో చిరంజీవి ఇండస్ట్రీ ప్రముఖులతో కలసి జగన్ తో భేటీ కానున్నారు. 

ఈ నేపథ్యంలో జగన్ ముందు ఉంచాల్సిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నివాసంలో ఇండస్ట్రీ పెద్దల కీలక సమావేశం జరిగింది. 

చిరంజీవితో పాటు ఈ సమావేశంలో నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్,  ఏషియన్ సునీల్,  స్రవంతి  రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ,  వి.వి.వినాయక్, జెమిని కిరణ్,  సుప్రియ తదితరులు పాల్గొన్నారు. 

ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ని కలసి చిత్ర పరిశ్రమ సమస్యలు వివరించాలని పేర్ని నాని చిరంజీవిని కోరారు. 

ఈ నెలాఖరులో జగన్, చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ పెద్దల మధ్య భేటీ జరగనున్నట్లు టాక్. కరోనా ప్రభావానికి తోడు.. ఏపీలో థియేటర్స్ విషయంలో ప్రభుత్వ ఆంక్షల, బిసి సెంటర్లలో టికెట్ ధరలు లాంటి సమస్యలతో ఎగ్జిబిటర్లు థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ముందుకు రావడం లేదు. 

దీంతో పెద్ద చిత్రాల విడుదల ఇబ్బందిగా మారింది. తద్వారా సినిమానే నమ్ముకుని ఉన్న కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటిపై చిరంజీవి నివాసంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?