
యాంగ్రీ యంగ్‌మేన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కెరీర్ పరంగా టర్న్ తీసుకుంటున్నారు. హీరోగానే కాకుండా విలన్‌గానూ మారబోతున్నాడు. తాజాగా ఆయన గోపీచంద్ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో కీలక పాత్ర కోసం రాజశేఖర్‌ని సంప్రదించారట. అయితే పాత్ర నచ్చి తాను నటించేందుకు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇందులో రాజశేఖర్‌ది విలన్ పాత్ర అని తెలుస్తుంది. నిజంగానే విలన్ పాత్రానా? లేక బలమైన కీలక పాత్రనా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ చిత్రం కోసం రాజశేఖర్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఏకంగా రూ.నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. హీరోగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగానే రాజశేఖర్ అడుగుతున్నట్టు టాక్. అంతేకాదు తన పాత్రకి ప్రాధాన్యతని పెంచాలనే కండీషన్ కూడా పెట్టారట. అలా అయితేనే నటిస్తానని చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్.
హీరోగా రాణిస్తున్న క్రమంలో రాజశేఖర్ ఈ స్టెప్ తీసుకోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు షాక్‌కి గురి చేస్తుంది. అదే సమయంలో రాజశేఖర్ మంచి స్టెప్ తీసుకుంటున్నారనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఒకప్పుడు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా రాణించిన జగపతిబాబు, శ్రీకాంత్ సైతం టర్న్ తీసుకుని విలన్ గా, బలమైన పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్‌ని ప్రారంభించారు. ఇప్పుడు రాజశేఖర్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు టాక్.
ఒకప్పుడు స్టార్ హీరోగా, టాలీవుడ్ టాప్ హీరోగా రాణించారు రాజశేఖర్. ఆయన సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాలకు పోటీగా విడుదలయ్యేవంటే అతిశయోక్తి కాదు. కానీ ఇటీవల రాజశేఖర్ వరుస పరాజయాలు, పైగా సినిమాకి సినిమాకి గ్యాప్ రావడంతో ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. పైగా ఇప్పుడు యంగ్ హీరోల హవా పెరిగింది. దీంతో రాజశేఖర్ కెరీర్ పరంగా టర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓ వైపు హీరోగా నటిస్తూనే, బలమైన, ప్రయారిటీ కలిగిన పాత్రలు వస్తే ఇతర హీరోల సినిమాల్లోనూ నటించేందుకు సుముఖతగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్ `శేఖర్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. దీంతోపాటు `మర్మాణువు` అనే మరో సినిమాలో నటిస్తున్నారు.