'నారప్ప' విషయంలో బాధపడ్డ శ్రీవిష్ణు.. రెండ్రోజులు భోజనం చేయలేదట

By telugu teamFirst Published Aug 16, 2021, 2:05 PM IST
Highlights

కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడింది. కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో తెలంగాణలో థియేటర్స్ తెరుచుకున్నాయి. కానీ ఏపీలోనే థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడింది. కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో తెలంగాణలో థియేటర్స్ తెరుచుకున్నాయి. కానీ ఏపీలోనే థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా ప్రభావానికి తోడు టికెట్ ధరల్ని ప్రభుత్వం తగ్గించడంతో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రావడం లేదు. 

ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే థియేటర్స్ రన్ అవుతున్నాయి. దీనితో ఇటీవల థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాల బిజినెస్ అరకొరగానే జరుగుతోంది. దీనితో చాలా మంది నిర్మాతలు ఓటిటి వైపు చూస్తున్నారు. ఇదిలా ఉండగా యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'రాజ రాజ చోర' చిత్రం ఈ నెల 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు ఆదరణ ఉండాలి' అని శ్రీవిష్ణు అన్నాడు. 

అందరి హీరోల అభిమానులు ఏ చిత్రాన్ని చూస్తారో అదే పాన్ ఇండియా చిత్రం అని శ్రీవిష్ణు అన్నాడు. రాజ రాజ చోర చిత్రం చూసే మహిళా అభిమానులకు నేను చాలా రోజులు గుర్తుండి పోతాను. ఈ చిత్రం ప్రేక్షకులని కొత్త లోకంలోకి తీసుకువెళుతుంది అని అన్నాడు. 

ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనిల్ రావిపూడి, హీరో నారా రోహిత్ అతిథులుగా హాజరయ్యారు. శ్రీవిష్ణు కథల ఎంపిక బావుంటుంది అని అనిల్ రావిపూడి అన్నారు. ఇక నారా రోహిత్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తాను చూశానని.. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని అన్నాడు. 

హాసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఫన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!