ఈ ఏడాది ఇప్పటి వరకు టాలీవుడ్ కి అంత గొప్పగా ఏమి కలసి రాలేదు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లు అనదగ్గ వారు చాలా మంది ఈ ఏడాది సక్సెస్ ఫుల్ చిత్రాలు డెలివర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు టాలీవుడ్ కి అంత గొప్పగా ఏమి కలసి రాలేదు. హను మాన్, కల్కి లాంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించాయి. ఇక టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లు అనదగ్గ వారు చాలా మంది ఈ ఏడాది సక్సెస్ ఫుల్ చిత్రాలు డెలివర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.
ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో సంక్రాంతికి గుంటూరు కారం చిత్రం వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ కూడా కాపాడలేకపోయింది. ఒకే రకమైన సెంటిమెంట్ చిత్రాలని త్రివిక్రమ్ కొనసాగిస్తున్నారు అంటూ విమర్శలు వినిపించాయి.
మరో డైరెక్టర్ బోయపాటి శ్రీను చివరగా తెరకెక్కించిన చిత్రం స్కంద. ఈ మూవీ ఈ ఏడాది రాలేదు. గత ఏడాది వచ్చినప్పటికీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బోయపాటి కూడా ఒకే రకమైన ఫార్ములా యాక్షన్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు అనే కామెంట్ స్కందతో వినిపించింది.త్రివిక్రమ్, బోయపాటి లాంటి వాళ్ళు ఒకే రకమైన చిత్రాలు చేసినప్పటికీ వాళ్ళ మ్యాజిక్ వర్కౌట్ అయితే భారీ హిట్లు ఖాయం. కానీ గుంటూరు కారం, స్కంద చిత్రాల్లో అది జరగలేదు.
టాలీవుడ్ లో ఊహించని షాక్ గత వారం ఎదురైంది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ విధంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఇటీవల ఫెయిల్ అవుతున్నారు. ప్రేక్షకుల్లో వీరు నమ్మకం కోల్పోతున్నారా అనే విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.