జెన్నిఫర్ లోఫేజ్ గాయనిగా, నటిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఐదు పదుల వయసు దాటినా ఇంకా ఆమె అందం చెక్కు చెదరలేదు. కళ్ళు చెదిరే ఫిట్నెస్ తో జెన్నిఫర్ వరల్డ్ వైడ్ సినీ ప్రియులని ఆకర్షిస్తోంది.
జెన్నిఫర్ లోఫేజ్ గాయనిగా, నటిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఐదు పదుల వయసు దాటినా ఇంకా ఆమె అందం చెక్కు చెదరలేదు. కళ్ళు చెదిరే ఫిట్నెస్ తో జెన్నిఫర్ వరల్డ్ వైడ్ సినీ ప్రియులని ఆకర్షిస్తోంది. అయితే జెన్నిఫర్ వ్యక్తిగత జీవితంలో సరైన ప్రేమికుడిని పొందలేకపోతోంది.
తాజాగా జెన్నిఫర్ లోఫేజ్ తన నాల్గవ భర్త బెన్ అఫ్లెక్ నుంచి కూడా విడిపోతోంది. అధికారికంగా వీళ్ళిద్దరూ డివోర్స్ కోసం కోర్టులో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట లాస్ ఏంజిల్స్ లో అంబానీ కూతురు ఇషా అంబానీకి చెందిన అత్యంత విలాసవంతమైన విల్లాని కొనుగోలు చేసి అందులో కొత్త కాపురం మొదలు పెట్టారు.
జెన్నిఫర్, బెన్ కొన్న ఆ ఇంటి ఖరీదు 500 కోట్లు. అంత ఖరీదైన, విలాసవంతమైన ఇంట్లో వీరి కాపురం రెండేళ్లు కూడా నిలబడలేదు. ఇప్పుడు జెన్నిఫర్, బెన్ విడాకుల వార్త వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. 1997లోనే జెన్నిఫర్ పెళ్లిళ్ల తంతు మొదలయింది. ఆ ఏడాది ఓజాని నోవాని ఆమె వివాహం చేసుకుంది. ఏడాదికే ఇద్దరూ విడిపోయారు.
2001లో క్రిస్ జూడ్ ని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయింది. 2004లో మార్క్ ఆంటోనిని పెళ్లి చేసుకుంది. అతడితో మాత్రం పదేళ్లు కాపురం చేసి 2014లో విడాకులు తీసుకుంది. 2022 లో పెళ్లి చేసుకున్న బెన్ అఫ్లెక్ కి ఇప్పుడు డివోర్స్ ఇస్తోంది.