
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్.. ఆ మరుసటి రోజే ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల మరణించారు. ఈ విషాదాలతో సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర సీమలో మరో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది.
పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (Jakkula Nageswara Rao) (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ చిత్రాలకు నిర్మాత గా వ్యవహరించారు. నిర్మాత మృతి పట్ల పలువురు సీని, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి గతంలో ఆయన సెన్సార్ ఆఫీసులోనే సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్మించిన అమ్మా నాన్న ఊరెళితే' అనే సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా ఏకంగా 40 సీన్స్ ను కట్స్ చేసింది. దీంతో అవమానంగా భావించిన ఆయన సూసైడ్ చేసుకున్నారు.
నాగేశ్వర్ రావు కు భార్య తో పాటు కుమారుడు, ఒక కుమార్తే ఉన్నారు.
కాగా, గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో వరుస వివాద వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు సమస్యతో బాధపడుతూ గచ్చిబౌలి ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. అలాగే.. గత రెండు రోజుల క్రితం తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఊపిరితిత్తుల సమస్యతో నే ఇబ్బందిపడుతూ మరణించిన విషయం తెలిసిందే.