Akhanda: బాలయ్య - బోయ మాస్.. రికార్డుల జాతర, 'లవ్ స్టోరీ'ని అధికమించిన అఖండ

pratap reddy   | Asianet News
Published : Dec 02, 2021, 08:36 PM ISTUpdated : Dec 02, 2021, 08:40 PM IST
Akhanda: బాలయ్య - బోయ మాస్.. రికార్డుల జాతర, 'లవ్ స్టోరీ'ని అధికమించిన అఖండ

సారాంశం

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన మాస్ చిత్రం ఇదే.

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన మాస్ చిత్రం ఇదే. అఖండ విడుదలయ్యాక వరుసగా పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. దీనితో ఇండస్ట్రీ మొత్తం అఖండ రిలీజ్ కోసం ఎదురు చూసింది. అంతా ఊహించినట్లుగానే అఖండ మూవీ బాలయ్య సింహ గర్జనతో థియేటర్స్ లో సందడి షురూ చేసింది. 

అంతా ఊహించినట్లుగానే Akhanda చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది విడుదలైన టాలీవుడ్ చిత్రాల్లో అఖండ కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

యుఎస్ లో అఖండ రికార్డులు మొదలయ్యాయి. ప్రీమియర్ షోల ద్వారా నార్త్ అమెరికాలో అఖండ చిత్రం 325K డాలర్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇదే హైయెస్ట్. నాగ శేఖర్ కమ్ముల, నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రాన్ని అధికమిస్తూ అఖండ మూవీ ఈ రికార్డు సాధించింది. అఖండ తర్వాత లవ్ స్టోరీ చిత్రం 313K డాలర్లతో రెండవ స్థానంలో.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 300K డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నాయి. 

లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి అఖండ చిత్రానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. బాలయ్యని మాస్ లుక్ లో ప్రజెంట్ చేయడంలో ప్రస్తుతం ఉన్న దర్శకులలో బోయపాటికి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. బాలకృష్ణ అఘోరగా అఖండ పాత్రలో విశ్వరూపం ప్రదర్శించారు అని ప్రేక్షకులు అంటున్నారు. బాలయ్య మాస్ కు తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ సంగీతం తోడైంది. 

ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. శ్రీకాంత్ విలన్ రోల్ లో మెరిశాడు. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ మాస్ ఎలిమెంట్స్ బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకునే విధంగా ఉన్నాయి. 

Also Read: హాఫ్ శారీ పిచ్చెక్కించేలా నార్త్ బ్యూటీ ఫోజులు.. నడుము అందాలతో హాట్ షో

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌