
టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు కొత్త సంప్రదాయాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా వెండితెరపై పోటీపడే బడా బడా హీరోలు సైతం ఫ్యాన్స్ ను సైతం విస్మయానికి గురిచేస్తూ... తమదైన శైలిలో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు. ఒకరితో ఒకరు ఏ రేంజ్ లో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారంటే... అభిమానులు అనుకున్నట్లుగా నువ్వా నేనా అంటూ పోటీపడే హీరోలు సైతం నువ్వు నేను అంటూ స్నేహం మనదేరా అంటున్నారు.
యువ అగ్ర హీరోలు ఒకరి సినిమా ఓపెనింగ్లకు ఒకరు హాజరవుతూ అభిమానులను అలరించడం దగ్గర్నించి మొదలు పెడితే ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించటం, ఇతర హీరోల పాటలను ప్రమోట్ చేస్తూ ఒకరికొకరు తెగ సాయం చేసేసుకుంటున్నారు.
తాజాగా ఓ మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేయనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా విన్నర్. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తమన్ అందించిన ఆడియో త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఒక పాటను మహేష్ తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేశాడు.
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న మహేష్ బాబు. షూటింగ్ లోకేషన్ నుంచే ఈ రోజు (బుధవారం) సితార అనే విన్నర్ తొలి పాటను రిలీజ్ చేశాడు. సితార.. మహేష్ కూతురి పేరు కావటంతో మహేష్ చేతులు మీదుగా ఆ పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అలా మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేయటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.