టాలీవుడ్ లో విషాదం నెలకొంది. తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ కమెడియన్ అల్లు రమేశ్ తాజాగా కన్నుమూశారు.
గతేడాది చిత్ర పరిశ్రమ వరుస విషాదాలతో నిండిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనూ సినీ దిగ్గజాలు దివికెగిసిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్, అలనాటి నటి జమున, రీసెంట్ గా తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇలా వరుస విషాదాలు చిత్రసీమను వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు కన్నుమూశారు. తెలుగు ప్రేక్షకులను కమెడియన్ గా, ఆయా పాత్రలతో అలరించిన ప్రముఖ కమెడియన్ అల్లు రమేశ్ (Allu Ramesh) తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ఈవిషయాన్ని దర్శకుడు ఆనంద్ రవి సోషల్ మీడియాలో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అల్లు రమేష్ మరణ వార్తకు ఆనంద్ రవితోపాటు సినీ ప్రముఖులు కూడా సంతపాలు వ్యక్తం చేస్తున్నారు. ాయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. ఇక అల్లు రమేశ్ విశాఖపట్నంలో నాటకాల్లో నటించేవారు. తన నైపుణ్యంతో సినిమాల్లోనూ అవకాశాలు అందాయి. దీంతో నటుడిగా మారారు.
తోలుబొమ్మలాట, మధురవైన్స్, రావణదేశం, చివరిగా విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ, యూట్యూబ్ లో ప్రసారం అయ్యే ‘మావిడాకులు’లోనూ నటించారు. ఆయన మరణం పట్ల ఇండస్ట్రీకి చెందినవారు విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యలుకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.