‘పుష్పరాజ్’ ఆన్ డ్యూటీ.. ఫిట్నెస్ పై బన్నీ ఫోకస్.. వైరల్ అవుతున్న వీడియో..

By Asianet News  |  First Published Apr 18, 2023, 4:39 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు. పుష్ప : ది రూల్ షూటింగ్ కొనసాగుతున్న సమయంలో మరింతగా జిమ్ లో సమయం గడుతున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
 


టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Pushpa 2 The Rule. 2021లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’కు ఇది సీక్వెల్. ఇండియా వైడ్ గా ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  పుష్ప రాజ్ మేనియా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం ‘పుష్ప’ అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలను పెంచేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు.

బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్.. ‘పుష్ప ఎక్కడ?’ అంటూ విడుదల చేసిన ఓ పవర్ ఫుల్ వీడియో  నెట్టింటిని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లో పుష్ప అప్డేట్స్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. సినిమాపై తారా స్థాయి అంచనాలను పెంచేశారు. ఇక తాజాగా బన్నీకి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు లైక్స్, షేర్లు చేస్తున్నారు. 

Latest Videos

ఆ వీడియోలో బన్నీ జిమ్ లో థ్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తూ కనిపించాడు. పుష్ప అవతార్ లోనే లాంగ్ హెయిర్ తో ఆకట్టుకున్నారు. ఫిట్ నెస్ బన్నీ మరింతగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మరో షెడ్యూల్ కు సిద్దం అవుతున్నారు. సీక్వెల్ తో పుష్పరాజ్ ఎలాంటి పార్టీ ఇవ్వబోతున్నారోనని  అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యేర్నెని, శంకర్ నిర్మిస్తున్నారు. రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది. సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సీక్వెల్ లో మరి కొంత మంది ఆర్టిస్టులు యాడ్ కాబోతున్నట్టు ప్రచారం. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికైనా లేదంటే సమ్మర్ లోనైనా విడుదల చేయబోతున్నారు. 

 

Indian MONSTER on Duty!!!! 💥💥💥 🦁 pic.twitter.com/tXYdoTmUvJ

— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun)
click me!