
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో.. ప్రభు,నయనతార, జ్యోతిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా చంద్రముఖి. 2004 తో రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలనంగా మారింది. తమిళ,తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఆతరువాత ఈసినిమాకు సీక్వెల్ చేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. రజనీకాంత్ కూడా ఈసినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇకఇన్నాళ్లకు .. అంటే చంద్రముఖి రిలీజ్ అయిన 18 ఏళ్ళకు ఈమూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా తమిళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ కొరియో గ్రఫర్ రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతోంది.
చంద్రముఖి 2 షూటింగ్ కు ముందు రాఘవ లారెన్స్, వాసు రజినీకాంత్ వద్దకు వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇక చంద్రముఖి 2లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, వడివేలు.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకంటే ముందు రాఘవ హీరోగా రుద్రుడు అనే మరో సినిమా రిలీజ్ అవ్వగా.. ఆసినిమాకు సబంధించి ఇటర్వ్యూలో రాఘవ లారెన్స్ ఆసక్తికర విషయం వెల్లడించాడు.
రుద్రుడు సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడాడు రాఘవ లారెన్స్. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి చంద్రముఖి గురించి డిఫరెంట్ గా ప్రశ్న అడిగాడు. ఆ సినిమాలో పాము వెళ్లిపోవడంతో ఎండ్ చేశారు, మరి దానికి కంటిన్యూ చంద్రముఖి 2 సినిమాలో ఉంటుందా.. అసలు ఆ పామును ఈసినిమాలో చూపిస్తారా అని ప్రశ్నించగా.. లారెన్స్ సమాధానమిస్తూ.. అది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఆ పాముకు.. ఈ కథకు ముగింపు చంద్రముఖి 3లో ఉంటుంది అని అన్నారు. దీంతో చంద్రముఖి 3 కూడా ఉండబోతున్నట్టు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు లారెన్స్.
హారర్ సినిమాలు చేయడంతో లారెన్స్ సిద్ధ హస్తుడు ఇప్పుటికే.. వరుసగా.. కాంచన సీక్వెల్స్ తీసుకుంటూ వస్తున్నాడు.ఇందులో దాదాపు 20 సీక్వెల్స్ చేస్తానని కూడా చెప్పాడు. ఇక చంద్రముఖికి ఇప్పటికే రెండుసీక్వెల్స్ అనుకుంటున్నాడు రాఘవా. ఇక వాటిని పెంచినా. ఆశ్చర్యం అవసరం లేదు.