సీఎం జగన్ తో భేటీ.. నాకే ఆహ్వానం అందింది... చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్టీఆర్, నాగార్జున మిస్సింగ్

By Sambi Reddy  |  First Published Feb 10, 2022, 11:11 AM IST

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (CM Jagan)తో భేటీకి నాకు మాత్రమే ఆహ్వానం ఉందని తెలుసు. ఇంకెవరెవరిని పిలిచారో తెలియదన్నారు. ఈ సమావేశం పూర్తిగా చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగిస్తుంది. 


సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు చిరంజీవి (Chiranjeevi)నేతృత్వంలోని చిత్ర ప్రముఖుల బృందం నేడు సీఎంతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. చిరంజీవితో పాటు మహేష్(Mahesh), ప్రభాస్, ఎన్టీఆర్, పోసాని, ఆర్ నారాయణమూర్తి, కొరటాల శివ పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున పేరు వినిపించినప్పటికీ వారు ఈ భేటీకి హాజరుకావడం లేదని తెలుస్తుంది. తాడేపల్లికి చిరంజీవి, మహేష్, ప్రభాస్ తో పాటు లిస్ట్ లో ఉన్న చిత్ర ప్రముఖులు కొందరు చేరుకున్నారు. 

కాగా బేగంపేట ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (CM Jagan)తో భేటీకి నాకు మాత్రమే ఆహ్వానం ఉందని తెలుసు. ఇంకెవరెవరిని పిలిచారో తెలియదన్నారు. ఈ సమావేశం పూర్తిగా చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగిస్తుంది. సీఎం జగన్ తో భేటీలో పాల్గొనాలా? వద్దా? అనే విషయంపై స్టార్స్ మల్లగుల్లాలు పడ్డట్లు సమాచారం. వీరిని ఒప్పించే క్రమంలో చిరంజీవి విసిగిపోయి ఉండవచ్చు. 

Latest Videos

undefined

ఎన్టీఆర్ (NTR)హాజరు కాలేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడిగా సీఎం జగన్ ని ప్రత్యర్థిగా భావిస్తూ ఉండవచ్చు. అయితే జగన్ కి అత్యంత సన్నిహితుడైన నాగార్జున ఎందుకు రావడం లేదనేది ఆసక్తికర అంశం. కొద్దిరోజుల క్రితం నాగార్జున ఒక్కరే సీఎం జగన్ నికలిశారు. ప్రముఖులు అందరూ పాల్గొంటున్న కీలక మీటింగ్ కి ఆయన ఎందుకు రావడంతో లేదో అర్థం కావడం లేదు. 

అసలు చిరంజీవి, నాగార్జున (Nagarjuna)మధ్య కూడా విభేదాలు తలెత్తాయా అనే అనుమానాలు ఈ పరిణామాలతో కలుగుతున్నాయి. బంగార్రాజు ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున టికెట్స్ ధరలపై స్పందించారు. నా సినిమాకు ప్రస్తుత ధరలు సరిపోతాయి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ మాట్లాడారు.చిరంజీవి ఓ వైపు టికెట్స్ ధరల తగ్గింపు అతిపెద్ద సమస్యగా మాట్లాడుతుంటే నాగార్జున కొట్టిపారేయడం జరిగింది. 

మరోవైపు మంచు విష్ణు, ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, బాలకృష్ణలకు సీఎం జగన్ ఫోన్ చేయలేదట. ఈ కారణంగానే వారు మీటింగ్ కి హాజరు కావడం లేదని మరొక వార్త. ఏది ఏమైనా సీఎం జగన్ తో చిత్ర ప్రముఖుల భేటీ కేంద్రంగా పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  

click me!