మా ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళ్లారు, నేను వెళ్లాల్సిన అవసరం లేదు : అల్లు అరవింద్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 10, 2022, 10:43 AM IST
మా ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళ్లారు, నేను వెళ్లాల్సిన అవసరం లేదు : అల్లు అరవింద్

సారాంశం

మరికాసేపట్లో సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ మధ్యనే చిరంజీవి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోసారి జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం రావడంతో ఉత్కంఠగా మారింది.

మరికాసేపట్లో సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ మధ్యనే చిరంజీవి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోసారి జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం రావడంతో ఉత్కంఠగా మారింది. ఈ భేటీకి సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నాని సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, జగన్ మధ్య తగ్గించిన సినిమా టికెట్ ధరలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. 

ఈ భేటీలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి లాంటి ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరంతా బృందంగా వెళ్లి సీఎం జగన్ కి టాలీవుడ్ సమస్యలు వివరించనున్నారు. అలాగే టికెట్ ధరల సమస్యపై పరిష్కారం కోసం ప్రయత్నించనున్నారు. 

ఈ భేటీకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరవుతారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే తాను జగన్ మీటింగ్ కి వెళ్లడం లేదని తాజాగా అల్లు అరవింద్ ప్రకటించారు. మా ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళుతున్నారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు అని అల్లు అరవింద్ తెలిపారు. 

ఈ రోజుతో అన్ని సమస్యలకు ఎండ్ కార్డు పడుతుందని అరవింద్ వ్యాఖ్యానించారు. సానుకూలంగా చర్చలు జరుగుతాయని అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఈ భేటీకి హాజరవుతుండడం ఆసక్తిగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..