కాస్త కోలుకున్న శరత్ బాబు ఆరోగ్యం, ఐసీయూ నుంచి బయటకు టాలీవుడ్ స్టార్ నటుడు

Published : Apr 22, 2023, 01:12 PM IST
కాస్త కోలుకున్న శరత్ బాబు ఆరోగ్యం, ఐసీయూ నుంచి బయటకు టాలీవుడ్ స్టార్ నటుడు

సారాంశం

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలుస్తోంది.   

టాలీవుడ్ స్టార్ సీనియర్ సినీ నటుడు శరత్ బాబు రీసెంట్ గా అనారోగ్యం పాలు అయిన విషయం తెలిసిందే.. ఇన్నాళ్లు బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆయన.. తాజాగా కోలుకున్నాట్టు తెలుస్తోది. బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంత వరకు కోలుకున్నారని ఆయన సన్నిహితులు  ప్రకటించారు. ఐసీయూ నుంచి సాధారణవిభాగానికి శరత్ బాబును మార్చినట్టు తెలుస్తోంది. అయితే బెంగళూరు హాస్పిటల్ లో ఉండగానే మరోసారి ఆయన పరిస్థితి విషమించినట్టు తెలిసింది. దాంతో శరత్ బాబును  బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో ఆయనను ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు. ఈ విషయం తెలిసి శరత్ బాబు అభిమానులు కాస్త కుదుటపడ్డారు. సౌత్ ల్ దాదాపు అన్ని భాషల్లో నటించారు శరత్ బాబు. తెలుగు సినిమాలతో మొదలు పెట్టి.. తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో శరత్ బాబు లీడ్ క్యారెక్టర్లు చేశారు. 

1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులు అందుకోవడం విశేషం. ఇక శరత్ బాబు, రమాప్రభ మధ్య ఇప్పటికి తేలని వివాదం ఉంది. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్