‘మామా మశ్చీంద్ర’ టీజర్ చూశారా.. త్రిపుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చిన సుధీర్ బాబు..

By Asianet News  |  First Published Apr 22, 2023, 12:49 PM IST

యంగ్ హీరో సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ వచ్చి ఆకట్టుకుంది.  


టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మామ మశ్చీంద్ర’ (Mama Mascheendra). చిత్రానికి హర్షవర్దన్ దర్శకత్వం  వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్పెస్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. వరుసగా అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. 

మామా మశ్రీంద్ర టీజర్‌ను మేకర్స్ అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ లాంచ్ చేశారు. టీజర్‌ని ముందుగా విడుదల చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. మొత్తానికి తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. టీజర్‌లో.. సుధీర్ బాబు మూడు విభిన్న గెటప్స్ లలో కనిపించారు. గతంలో లుక్ పోస్టర్లను విడుదల చేసిన క్యారెక్టర్ల ప్రపంచాన్ని టీజర్ లో చూపించారు. మూడు గెటప్స్ లలో సుధీర్ బాబు అదరగొట్టాడు.  క్రిమినల్ గా, లావుగా, ఎనర్జిటిక్ డీజేగా సుధీర్ ఆకట్టుకున్నారు. 

Latest Videos

కథ పరంగా చూస్తే మూడు ప్రధాన ప్రపంచాలను పరిచయం చేశారు. ఒక్కోక్కరి జీవితంలోని సమస్యలను, టార్గెట్స్ ను కూడా  పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది. సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా నటిస్తోంది. డీజేకి జోడీగా మిర్నాళిని రవి నటిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ అద్బుతంగా ఉంది.  రీసెంట్ గా వచ్చిన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ తరహాలోనే కనిపించినా కథ పరంగా డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. 

‘మామ మశ్చీంద్ర’ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిర్మించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రవీణ్ లక్కరాజు అదనపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. వరుసవగా అందుతున్న అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెగుతున్నాయి.

This is a trio you don't wanna mess with👊 Here's the teaser! 😁

▶️ https://t.co/FZbBUK6EU4 pic.twitter.com/fOaFoZe5kb

— Sudheer Babu (@isudheerbabu)
click me!