సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్ ‘ఏజెంట్’.. రన్ టైమ్ ఎంతంటే.?

By Asianet News  |  First Published Apr 22, 2023, 10:53 AM IST

అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’. యాక్షన్ ప్యాక్డ్స్ గా రాబోతోన్న చిత్రం తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.  రన్ టైమ్ కూడా ఫర్ఫెక్ట్ గా లాక్ అయ్యింది. 
 


అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరిగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సాలిడ్ సక్సెస్ ను సొంతం చేసుకునేందుకు ‘ఏజెంట్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ Agentలో నటించారు. సినిమా కోసం బాగా కష్టపడ్డారు. యాక్షన్ల పరంగా, బాడీ పరంగా, డాన్స్ పరంగా అఖిల్ ఎంతగానో శ్రమించారని ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే అర్థం అవుతోంది.  

మరో ఆరురోజుల్లో ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. అఖిల్ తన సినిమా కోసం ప్రమోషన్స్ కూడా విభిన్నంగా నిర్వహిస్తున్నారు. మొన్నటి ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో 171 అడుగుల హైట్ నుంచి జంప్ చేసి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.  ఇలా సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.  ఈ క్రమంలో మరో అప్డేట్ అందింది. తాజాగా చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని వెల్లడించారు. 

Latest Videos

ఏజెంట్ చిత్రానికి  సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను అందించింది. చిత్రంలో భారీ యాక్షన్స్ తో పాటు వయలెన్స్ కూడా  ఉండటంతో ఈ సర్టిఫికెట్ ను అందుకుంది. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. 12 ఏండ్లలోపు పిల్లల కూడా తల్లిదండ్రులతో కలిసి చూడవచ్చు. ఇక రన్ టైమ్ విషయానికొస్తే 2 గంటల 36 నిమిషాలకు లాక్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ కు ఇది ఫర్ఫెక్ట్ రన్ టైమ్ అనే చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. 

ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అఖిల్ నయా లుక్, యాక్షన్, స్టంట్స్ కు ప్రేక్షకులను ఫిదా అవ్వడం ఖాయమంటున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించారు. వక్కంతం వంశీ స్టోరీ అందించారు. మలయాళ స్టార్ మమ్ముుట్టీ కీలక పాత్రలో నటించారు. సాక్షి వైద్య హీరోయిన్. హిప్ హాప్ తమిజా సంగీతం అదిస్తున్నారు. ఏప్రిల్ 28న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. 

𝐔ltimate 𝐀ction LOCKED😎 is certified with 𝐔/𝐀 & all LOADED to offer you all a WILD ACTION TREAT in cinemas from APRIL 28th 🔥 ❤️‍🔥 pic.twitter.com/sF9zI86O3I

— AK Entertainments (@AKentsOfficial)
click me!