డీప్ ట్రబుల్ లో RRR మూవీ.. తమిళనాడులో 50% ఆక్యుపెన్సీ ఆదేశం

By team teluguFirst Published Dec 31, 2021, 10:28 PM IST
Highlights

మహమ్మారి కరోనా ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. ఒక వైపు ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంటే మరోవైపు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై కోవిడ్ చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు.

మహమ్మారి కరోనా ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. ఒక వైపు ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంటే మరోవైపు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై కోవిడ్ చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సినిమా అంటేనే జన సమూహం అవసరం. క్రమంగా మూడో దశ కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. 

ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రలో భారీగా కోవిడ్ కేసులు పెరగడంతో అక్కడ ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న ఆంక్షలతో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ చిత్రం కూడా వాయిదా పడింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోవిడ్ నిబంధనల్ని అమలులోకి తీసుకువచ్చింది. 

ఈ నిబంధనలు మేరకు థియేటర్లు, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి జనవరి 10 వరకు అమలులో ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఆర్ఆర్ఆర్ చిత్ర పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. 

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వందల కోట్ల బడ్జెట్ లో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఈ తరహా నిబంధనల నడుమ విడుదల చేయడం సాధ్యం అయ్యే పని కాదు. బడ్జెట్ వెనక్కి రావాలంటే ఫుల్ ఆక్యుపెన్సీ ఉండాలి. 

గత రెండు రోజులుగా కోవిడ్ కేసుల్లో సడెన్ స్పైక్ కనిపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీనితో అలర్ట్ అయిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొత్త నిబంధనలు విధించారు. 

ఇలాంటి పరిస్థితుల్లో జక్కన్న రాజమౌళి, నిర్మాత దానయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో ఎలాగు టికెట్ ధరల సమస్య ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో ఆంక్షలు మొదలయ్యాయి. ఆర్ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రం విడుదల కావాలంటే అన్ని చోట్ల పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కోవిడ్ కేసులు ఇంకా పెరిగితే ఆంక్షలు మరింత కఠినంగా మారే అవకాశం లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి లాంగ్ రన్ కూడా చాలా అవసరం. 

ఇప్పుడు టెన్షన్ కేవలం ఆర్ఆర్ ఆర్ చిత్రానికి మాత్రమే కాదు.. ఆర్ఆర్ఆర్ తర్వాత వారం రోజుల్లో రాబోతున్న ప్రభాస్ రాధేశ్యామ్, అజిత్ వాలిమై చిత్రాలకు కూడా ఇది షాకే. ప్రస్తుతానికి తమిళనాడు ప్రభుత్వం జనవరి 10 వరకు కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిబంధనలు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా తాజా పరిస్థితులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డీప్ ట్రబుల్ లోకి నెట్టాయి. 

Also Read: Rise of Ram Song: రామం రాఘవం అంటూ నరనరాల్లో రక్తం ఉప్పొంగించారు

click me!