LaLa Bheemla DJ Version: లాలా భీమ్లా డీజే వెర్షన్ ఇదిగో.. మోత మోగించే బీట్, న్యూ ఇయర్ సంబరాలు షురూ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 31, 2021, 07:30 PM IST
LaLa Bheemla DJ Version: లాలా భీమ్లా డీజే వెర్షన్ ఇదిగో.. మోత మోగించే బీట్, న్యూ ఇయర్ సంబరాలు షురూ

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సంక్రాంతికి జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా భీమ్లానాయక్ రిలీజ్ వాయిదా పడింది. 

దీనితో నిరాశలో ఉన్న అభిమానులకు జోష్ పెంచడానికి, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని రెట్టింపు చేసేందుకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ 'లాలా భీమ్లా సాంగ్ డీజే వెర్షన్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన లాలా భీమ్లా సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ థియేటర్స్ లో మోత మోగించడం ఖాయం అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా వారి జోష్ పెంచేలా డీజే వెర్షన్ వచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ ఊగిపోయి డాన్స్ చేసేలా తమన్ ఈ పాటకు డీజే మిక్స్ చేశారు.డీజే వర్షన్ పార్టీల్లో, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో రీసౌండ్ వచ్చేలా వినిపించనుంది. లాలా భీమ్లా డీజే వర్షన్ విడుదలయ్యాక న్యూ ఇయర్ వేడుకలు షూరూ చేయాలనీ పవన్ అభిమానులంతా సోషల్ మీడియాలో ఎదురుచూస్తున్నారు. సాంగ్ విడుదల కాగానే హంగామా మొదలైపోయింది. 

Also Read: కన్నీళ్లు రావట్లేదు.. 2021 విషాదాలు, మ్యారేజ్ లైఫ్ గురించి సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక డిసెంబర్ 31 రాత్రంతా మోత మోగడమే మిగిలుంది. భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు వస్తుండడంతో నిర్మాతల మండలి చర్చలు జరిపి భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. 

 

తమన్ సంగీతం అందించిన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో నిత్యా మీనన్.. రానాకి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం