మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది. దర్శక ధీరుడు రాజమౌళి నుంచి బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడం, ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకోవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇక చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దేశం మొత్తం తిరుగుతూ ఒక రేంజ్ లో పబ్లిసిటీ తీసుకువస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో ఇన్స్టంట్ హిట్ గా మారిపోతోంది. ఇటీవల ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకు సంబంధించిన 'కొమరం భీముడో' సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అభిమానులకు గూస్ బంప్స్ పీలింగ్ కలిగించింది.
తాజాగా ఇప్పుడు రాంచరణ్ అల్లూరి పాత్రకు సంబంధించిన Rise Of Ram సాంగ్ ని రిలీజ్ చేశారు. సంస్కృత లిరిక్స్ తో కూడిన ఈ పాట నరాల్లో రక్తం ఉప్పొంగే ఫీలింగ్ కలిగిస్తోంది. రామం రాఘవం రణధీరం రాజసం అంటూ సాగే లిరిక్స్ అల్లూరి పరాక్రమాన్ని వర్ణిస్తున్నాయి.
ఈ పాటని కీరవాణి తండ్రి శివ దత్త సంస్కృత పదాలతో రచించారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటని మల్టిపుల్ సింగర్స్ పాడారు. విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ ఈ సాంగ్ కి గాత్రం అందించారు.