పవన్, మహేష్ చిత్రాలకు ఆ టైటిల్స్ ఫిక్స్ అయినట్లే.. ఫ్యాన్స్ ఇక చేసేదేమీ లేదు

By Asianet NewsFirst Published May 12, 2023, 6:00 AM IST
Highlights

కొన్నిసార్లు కథకి అనుగుణంగా టైటిల్ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఫ్యాన్స్ కి ఆ టైటిల్స్ నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్ బిగ్ హీరోలు పవన్, మహేష్ బాబు చిత్రాలకు నెలకొంది. 

సినిమాపై ఆసక్తి పెంచడంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. స్టార్ హీరోల చిత్రాల కోసం దర్శకులు టైటిల్స్ విషయంలోనే పెద్ద కసరత్తు చేస్తుంటారు. టైటిల్ పవర్ ఫుల్ గా, ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు కథకి అనుగుణంగా టైటిల్ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఫ్యాన్స్ కి ఆ టైటిల్స్ నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్ బిగ్ హీరోలు పవన్, మహేష్ బాబు చిత్రాలకు నెలకొంది. 

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి 'బ్రో' అనే విచిత్రమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. 

Latest Videos

దీనితో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై విరుచుకుపడ్డారు. అసలు బ్రో అనేది టైటిల్ ఏంటి.. అది పవన్ కళ్యాణ్ సినిమా అనుకుంటున్నారా లేక ఇంకేమైనా అంటూ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆ టైటిల్ కే చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బ్రో అనే టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేసినట్లు లేటెస్ట్ న్యూస్. 

ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి కూడా ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. త్రివిక్రమ్ చిత్రం అంటే తెలుగు టైటిల్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రానికి 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ని చిత్ర యూనిట్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. మహేష్ చిత్రానికి మాస్ టైటిల్ కావాలని భావించే ఫ్యాన్స్ కి ఇది నిరాశే. కానీ త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్ పెట్టినప్పటికీ దానికి న్యాయం చేస్తారు అని మరికొందరు భావిస్తున్నారు. 

click me!