
యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ లో టఫ్ ఫేజ్ సాగుతోంది. వరుస పరాజయాలు గోపీచంద్ మార్కెట్ ని దెబ్బతీస్తున్నాయి. రీసెంట్ గా గోపీచంద్ నుంచి వచ్చిన రామబాణం చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. రామబాణం చిత్రం తొలివారంలో కేవలం 4 కోట్లు మాత్రమే రాబట్టింది.
గతంలో గోపీచంద్ కొన్ని యావరేజ్ చిత్రాలతో పోల్చుకున్నా ఈ కలెక్షన్లు చాలా తక్కువే. దీనితో ఇప్పుడు గోపీచంద్ తన కెరీర్ ని ఒకసారి పునః పరిశీలించు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. వరుస పరాజయాల ఎఫెక్ట్ గోపీచంద్ రెమ్యునరేషన్ పై పడ్డట్లు తెలుస్తోంది.
గోపీచంద్ తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో సగం తగ్గించుకోవాలని అతడితో సన్నిహితంగా ఉంటున్న నిర్మాతలే సూచిస్తున్నారట. మంచి హిట్ అదే వరకు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మంచిది అని.. హిట్స్ వస్తే ఆ తర్వాత నిర్మాతలే ఎక్కువ మొత్తం ఇస్తారని సూచిస్తున్నారట.
మరి గోపీచంద్ నిర్మాతల సలహాలు పాటిస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉండగా గోపీచంద్ ప్రస్తుతం ట్రెండుకి తగ్గట్లు కాకుండా రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం గోపీచంద్ కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో నటిస్తున్నారు. గోపీచంద్ 31వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు టాక్.