ఈసారి బద్దలైపోద్ది.. 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ అదిరిపోయిందిగా.. లుంగీ, ఖాకీ, తుపాకీతో పవన్ మాస్ జాతర

Published : May 11, 2023, 05:30 PM IST
ఈసారి బద్దలైపోద్ది.. 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ అదిరిపోయిందిగా.. లుంగీ, ఖాకీ, తుపాకీతో పవన్ మాస్ జాతర

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పైఅంచనాలు మామూలుగా లేవు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పైఅంచనాలు మామూలుగా లేవు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచే హైప్ పెంచుతూ వచ్చారు. 

ఇక నేడు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం అని చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం ప్రకటించగానే సోషల్ మీడియాలో హంగామా మొదలయింది. ఈరోజే ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి కారణం ఉంది. 2012లో సరిగ్గా ఇదే రోజున గబ్బర్ సింగ్ చిత్రం రిలీజై సంచలనం సృష్టించింది. సో ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ కి ఇదే సరైన టైం అని దర్శకుడు హరీష్ శంకర్ భావించారు. 

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గ్లింప్స్ వచ్చేసింది. భగవత్ గీతలో వ్యాఖ్యలతో టీజర్ మొదలవుతుంది. ఏ కాలమున ధర్మమమునకు హాని కలిగి అధర్మము వృద్ధి చెందునో ఆ యువముల యందు నేను అవతారము దాల్చుచున్నాను అంటూ బ్యాగ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది. వెంటనే భగత్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీతో ఎంట్రీ ఇస్తారు. వీపు వెనుక తుపాకీతో కనిపిస్తాడు. 

మహంకాళి పోలీస్టేషన్ పాతబస్తీలో భగత్ పోలీస్ అధికారి. పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్ తో హరీష్ టీజర్ నింపేశారు. ఈ గ్లింప్స్ లో కేవలం పవన్ కళ్యాణ్ గెటప్స్ మాత్రమే పరిచయం చేసాడు అని చెప్పాలి. తుపాకీ, ఖాకి, లుంగీతో పవన్ మాస్ జాతర చేయబోతున్నట్లు గ్లింప్స్ తో అర్థం అవుతోంది. 

 

ఇక చివర్లో పవన్ 'ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది' అంటూ అదిరిపోయే డైలాగ్ చెప్పారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బిజియం టీజర్ కి సరికొత్త రూపు ఇచ్చింది అనే చెప్పాలి. పవన్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా దేవిశ్రీ బిజియం ఇచ్చారు. ఓవరాల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Meenakshi Chaudhary ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? ప్రభాస్‌ కాదు.. వామ్మో మీనాక్షి కోరికలకు మతిపోవాల్సిందే
Rani Mukerji: 47 ఏళ్ళ వయసులో క్రేజీ హీరోయిన్ గా రాణి ముఖర్జీ.. ఆమె కెరీర్ లో టాప్ 5 సినిమాలు ఇవే