చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

Published : Oct 20, 2018, 09:38 AM IST
చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

సారాంశం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దసరా కానుకగా విడుదల చేస్తారని మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ చిత్రబృందం నుండి ఎలాంటి ప్రకటన లేదు. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దసరా కానుకగా విడుదల చేస్తారని మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. 

కానీ చిత్రబృందం నుండి ఎలాంటి ప్రకటన లేదు. దీంతో చరణ్ టైటిల్ ఇదేనంటూ చక్కర్లు కొడుతోన్న 'వినయ విధేయ రామ' టైటిల్ మారుస్తున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అభిమానుల నుండి ఈ టైటిల్ ని వ్యతిరేకత రావడం, చిరంజీవి కూడా మరీ క్లాసీ టైటిల్ గా ఉందని అనడంతో టైటిల్ మార్చే పనిలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 

కానీ టైటిల్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. 'వినయ విధేయ రామ' టైటిల్ నే కన్ఫర్మ్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే విడుదల చేసి.. ఫస్ట్ లుక్ ని  మాత్రం దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది!

ఇవి కూడా చదవండి.. 

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!

 

PREV
click me!

Recommended Stories

Naga Chaitanya Sobhita: తమ ఉద్యోగులకు స్వయంగా భోజనాలు వడ్డించిన నాగచైతన్య, శోభిత
టీ షర్ట్ నుండి టీ గ్లాస్ వరకు.. కమల్ హాసన్ ఫోటో వాడితే ఇక అంతే సంగతులు?