
మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం చిత్రాన్ని దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసారు దిల్ రాజు. ఆయన ఎంతో ఎక్సపెక్ట్ చేసి తీసుకున్న ఈ చిత్రం యావరేజ్ టాక్ తో నష్టాలు తెచ్చి పెట్టిందని ట్రేడ్ లో చెప్తూంటారు. అయితే ఇప్పుడు టిల్లూ స్క్వేర్ సినిమా ఆ నష్టాలను రికవరీ చేసే దిశగా సాగుతోందని సమాచారం. ఎందుకంటే దిల్ రాజు..నైజాం ఏరియాలో టిల్లూ స్వ్కేర్ ని డిస్ట్రిబ్యూట్ చేసారు.
డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీ గా రిలీజ్ అయింది. ఎక్సపెక్ట్ చేసినట్లుగానే మార్నింగ్ షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నైజాం ఏరియాలో ఈ సినిమా బుకింగ్స్‌తోనే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయని సమాచారం. ఒక్క హైదరాబాద్‌లోనే టిల్లు స్క్వేర్ మూవీకి కోటిన్నర వరకు గ్రాస్ బుకింగ్స్ అయినట్లు ట్రేడ్ వర్గాలు మాట.
దిల్ రాజు ఈ చిత్రాన్ని ఏడు కోట్లు లోపే తీసుకున్నారని తెలుస్తోంది. గుంటూరు కారం నష్టాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం రైట్స్ ని తక్కువకే ఇచ్చారంటున్నారు. ఈ సినిమా మొదటి రోజే 3.7 కోట్లు షేర్ వరల్డ్ వైడ్ గా తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు అంటే శనివారం కే బ్రేక్ ఈవెన్ అవుతుందని లెక్కలు చెప్తున్నారు. టోటల్ రన్ లో ఈ సినిమా నైజాంలోనే 20 కోట్లు దాకా చేస్తుందని అంచనా. దాంతో గుంటూరు కారం సినిమాతో వచ్చిన నష్టాన్ని దిల్ రాజుకు ఈ సినిమా కాంపన్టేట్ చేస్తుంది ట్రేడ్ అంటోంది.
ఈ సినిమా నిర్మాత నాగవంశీ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఫస్ట్ డే 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచొచ్చని అన్నారు. అలాగే లాంగ్ రన్‌లో 100 కోట్లు కొల్లగొడుతుందని చెప్పాడు. దీంతో.. టిల్లు ఎంత రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని.. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది.
‘టిల్లు స్క్వేర్’ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై తెరకెక్కింది. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరకర్తలు.