నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ అదిరిందిగా..వకీల్ సాబ్ డైరెక్టర్ క్రియేటివిటీ మొత్తం చూపించాడు

Published : Mar 30, 2024, 12:42 PM IST
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ అదిరిందిగా..వకీల్ సాబ్ డైరెక్టర్ క్రియేటివిటీ మొత్తం చూపించాడు

సారాంశం

యంగ్ హీరో నితిన్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నటించాడు. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

యంగ్ హీరో నితిన్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నటించాడు. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. నితిన్ కి గత చిత్రాల ద్వారా ఫ్లాప్స్ ఎదురైనప్పటికి తదుపరి చిత్రాల లైనప్ గట్టిగానే ఉంది. 

ఒకవైపు నితిన్ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరోవైపు భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములు దర్శకత్వంలో నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నితిన్ కి ఆ తర్వాత సరైన హిట్స్ లేవు. పదేళ్లు విజయం కోసం ఎదురుచూశాడు. తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 

నితిన్ నేడు తన 41వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. నితిన్ బర్త్ డే సందర్భంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని తమ్ముడు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ లుక్ అదిరిపోయింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ తన క్రియేటివిటీ మొత్తం చూపించాడు. 

 

లారీ టాప్ లో నితిన్ బల్లెం పట్టుకుని కసిగా చూస్తున్న లుక్ ఆసక్తికరంగా ఉంది. ఓకే ఆ లారీని ఒక ట్రైబల్ మహిళ డ్రైవ్ చేస్తోంది. లారీ లోపల సీనియర్ హీరోయిన్ లయ, ఇతర నటీనటులు కూర్చుని ఉన్నారు. లయ ఈ చిత్రంలో నితిన్ సోదరి పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకి ఇది రీ ఎంట్రీ చిత్రం. మొత్తంగా నితిన్ తమ్ముడు ఫస్ట్ లుక్ మూవీపై ఆసక్తిని పెంచేసింది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?