Hyderabad Multiplex: మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేట్లలో మార్పు...ఎంత పెంచారో తెలుసా..?

By Mahesh JujjuriFirst Published Dec 31, 2021, 6:59 AM IST
Highlights

సినిమా టికెట్ రేట్లు పెంచుకనే వెసులు బాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో ఏపీలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా.. తెలంగాణాలో మాత్రం ఊరట లభిచింది ఇండస్ట్రీకి. దాంతో హైదరాబాద్ లోని బడా థియేటర్లలో టికెట్ రేట్లు సవరించారు.

తెలంగాణాలో సినిమా టికెట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలే ఏపీలో  ఇండస్ట్రీకి గడ్డుకాలం నడుస్తుంది. ఇక తెలంగాణాలో అయినా పరిస్థితులు మెరుగుపడితే బాగుండు అనుకున సినిమా పెద్దలకు.. ఇక్కడ తిపికబురే అందింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రావడంతో హైదరాబాద్ లోని మల్టీ ప్లెక్స్ లలో రేటర్లను సవరించారు. ఈరోజు నుంచి సవరించిన రేట్లు అమలోలకి వస్తాయంటూ ప్రకటించాయి మల్టీ ప్లెక్స్ థియేటర్స్ మేనేజ్ మెంట్స్.  

 

 హైదరాబాద్ లోని మల్టీ ప్లెక్స్ లలో… సవరించిన రేట్ల ప్రకారం.. ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉన్నాయి అంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన AMB సినిమాస్ లో మరియూ ప్రసాద్స్ ఐమాక్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ 350 అలాగే సెకండ్ క్లాస్ టికెట్ 295 కి సవరించారు. ఇక మరో మల్టీ ప్లెక్స్ థియేటర్ PVR లో ఫస్ట్ క్లాస్ 350 ఉండగా.. సెకండ్ క్లాస్ 290కి ఇంకా.. థార్డ్ క్లాస్ టికెట్ ను 250 కి సవరించారు. ఇక ఐనాక్స్ లో చూసుకుంటే ఇందులో నాలుగు సెక్షన్లు ఉండగా.. ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 350 , సెకండ్ క్లాస్ టికెట్ 250, థార్డ్ క్లాస్ టికెట్ ధర 200 ఉండగా... ఆతరువాతి క్లాస్ కు టికెట్ ధర 150గా ఫిక్స్ చేశారు. ఫైనల్ గా Asian మల్టీ ప్లెక్స్ లో చూసుకుంటే.. ఫస్ట్ క్లాస్ 350 ఉండగా సెకండ్ క్లాస్ 250.. థార్డ్ క్లాస్ టికెట్ ధర 175 గా సవరించారు. హైదరాబాద్ లోని  అన్ని మల్టీ ప్లెక్స్ లలో ఫస్ట్ క్లాస్ టికెట్ రేట్లు ఒకే విధంగా ఉన్నాయి. ఆతరువాత క్లాస్ లనోనే ఎవరికి నచ్చినట్టు వారుమార్పులు చేసుకున్నారు.

 

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లా నాయక్, లైగర్ లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు ఉండటంతో... టికెట్ రేట్ల పై రగడ గట్టిగా నడుస్తుంది. అసలే కరోనా వల్ల చాలా కాలంగా థియేటర్లు క్లోజ్ అయ్యి ఉన్నాయి.ఇండస్ట్రీ కూడా చాలా నష్టపోయి ఉంది. ఇఫ్పుడు సామాన్యుడిపై భారం పేరుతో టికెట్ రేట్లను భారీగా తగ్గించింది ఆంధ్రా గవర్నమెంట్. అంతా తన ఆధీనంలోకి తీసుకోవడంతో.. థియేటర్లు నడిపించలేం అంటూ.. అక్కడ చాలా థియేటర్లు క్లోజ్ చేశారు. ఇక తెలంగాణాలో మాత్రం రేట్లు పెంచుకునే వీలు కల్పించింది ప్రభుత్వం.AC థియేటర్లలో 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు టికెట్ ధర ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. మల్టిప్లెక్స్ లలో కనిష్టంగా 100 రూపాయల నుంచి 250 వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది. అలాగే మల్టీ ప్లెక్స్ లలోని రెక్లైనర్ సీట్లకు 300 రూపాయలు ధర నిర్ణయించింది. టికెట్ ధరలపై GST అదనమని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో హైదరాబాద్ మల్టీ ప్లెక్స్ థియేటర్లు ఈరోజు నుంచి సవరించిన టికెట్ రేట్లను అమలు చేయబోతున్నారు.

Also Read : నా పారితోషికం కట్ చేసుకోండి.. సినిమా ఓటిటికి మాత్రం వద్దు, స్టార్ హీరో కామెంట్స్

click me!