విజయ్ దేవరకొండ ఫొటోతో థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. థమ్స్ అప్ క్యాన్ పై రౌడీ హీరో.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

Published : May 28, 2022, 07:34 PM IST
విజయ్ దేవరకొండ ఫొటోతో థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. థమ్స్ అప్ క్యాన్ పై రౌడీ హీరో.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

సారాంశం

దేశంతోనే టాప్ సాఫ్ట్ డ్రింక్ ‘థమ్స్ అప్’ బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎంపికైన విషయం తెలిసిందే. ఆ సంస్థ తాజాగా విజయ్ ఫొటోతో స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది.  

ఏండ్లుగా సాఫ్ట్ డ్రింక్ లో రారాజుగానే నిలిచింది ‘థమ్స్ అప్’. సరికొత్త టెస్ట్ తో ఈ కూల్ డ్రింక్ ఇంకా డిమాండ్ లోనే  ఉంది. అయితే ఈ సంస్థ ప్రతి ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి తమ బ్రాండ్ ను ప్రమోషన్ చేస్తుంటాయి.  ఇందుకు పెద్ద స్టార్స్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంటాయి.  ఇటు సౌత్, నార్త్ లో Thumps Upను చివరిగా మహేశ్ బాబు (Mahesh Babu) ప్రమోట్ చేశారు. ఆయన స్థానంలో ఈ ఏడాది జనవరిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా, విజయ్ తో థమ్స్ అప్ బ్రాండ్ రూపొందించిన యాడ్ ఫిల్మ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అటు హిందీ, ఇటు తెలుగులోనూ ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ ఫిల్మ్ ఓ రేంజ్ లో ప్రమోషన్ ను  తెచ్చిపెట్టింది. దానికి తోడు విజయ్ క్రేజ్ ను కూడా థమ్స్ అప్ వాడుకోవడంతో  ఈ సాఫ్ట్ డ్రింక్ మొదటి స్థానంలో నే ఉంది. అయితే విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ రేజ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఆయన నటించిన ‘లైగర్’ కూడా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా థమ్స్ అప్ విజయ్ క్రేజ్ ను క్యాచ్ చేసుకునేందుకు థమ్స్ అప్ నుంచి స్పెషల్ ఎడిషన్ ను లాంచేసింది. థమ్స్ అప్ క్యాన్ పై రౌడీ విజయ్ ఫొటోను ముద్రించింది. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక కూడా ‘థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ ద్వారా లాంచ్ చేసిన క్యాన్ ను కొనుగోలు చేసి తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అభిమానులు కూడా ఈ పిక్స్ ను షేర్ చేస్తున్నారు.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?