బాలీవుడ్‌ సినిమాలపై సోనూ సూద్‌ సంచలన వ్యాఖ్యలు.. చెత్త సినిమాలు చేయకుండా సౌత్ ఇండస్ట్రీ కాపాడిందంటూ వ్యాఖ్యలు

Published : May 28, 2022, 06:04 PM ISTUpdated : May 28, 2022, 06:10 PM IST
బాలీవుడ్‌ సినిమాలపై సోనూ సూద్‌ సంచలన వ్యాఖ్యలు.. చెత్త సినిమాలు చేయకుండా సౌత్ ఇండస్ట్రీ కాపాడిందంటూ వ్యాఖ్యలు

సారాంశం

 సినిమాల్లో(బాలీవుడ్‌)కి వచ్చిన కొత్తలో పాజిటివ్‌ రోల్స్ చేయాలనుకునేవాడట. కానీ తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడంతో అన్నీ నెగటివ్‌ రోల్స్ వచ్చాయని తెలిపారు సోనూ సూద్‌.

రియల్‌ హీరోగా పేరుతెచ్చుకున్న రీల్‌ విలన్‌ సోనూ సూద్‌(Sonu Sood) బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ సినిమాలను ఆకాశానికి ఎత్తుతూ, హిందీ సినిమాలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌లో చెత్త సినిమాలు చేయకుండా సౌత్‌ సినిమాలు తనని కాపాడినట్టు తెలిపారు సోనూసూద్‌. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల `అచార్య`లో విలన్‌గా మెరిసిన సోనూసూద్‌ ప్రస్తుతం హిందీలో `పృథ్వీరాజ్‌` చిత్రంలో నటించారు. ఇందులో ఆయన చాంద్‌ బర్దాయి పాత్రలో కనిపించబోతున్నారు. 

అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోనూ సూద్‌ మీడియాకి ఇంటర్వ్యూలిచ్చారు. సోషల్‌ మీడియాలో కథనాల ప్రకారం సోనూసూద్‌  పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లో(బాలీవుడ్‌)కి వచ్చిన కొత్తలో పాజిటివ్‌ రోల్స్ చేయాలనుకునేవాడట. కానీ తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడంతో అన్నీ నెగటివ్‌ రోల్స్ వచ్చాయని తెలిపారు. ఏ చిత్ర పరిశ్రమ అయినా తాను కథల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తనని హిందీలో చెత్త సినిమాలు చేయకుండా సౌత్‌ సినిమాలు కాపాడాయని పేర్కొని సంచలనాలకు తెరలేపారు. 

తాను హిందీంతోపాటు సౌత్‌లోనూ నటించానని, ఒకానొక సమయంలో బాలీవుడ్‌ని వదిలేసి దక్షిణాది సినిమాలు మాత్రమే చేశానని తెలిపారు సోనూసూద్‌. అప్పట్లో అందరు తనని సౌత్‌లో ఎందుకు సినిమాలు చేస్తున్నావని ప్రశ్నించేవారని, అనుభవం కోసం చేస్తున్నాని చెప్పినట్టు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడైనా ఒక్కటే. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. బాలీవుడ్‌తో సహా దక్షిణాది ఇండస్ట్రీ అయిన సరే సినిమా బాగా లేకపోతే నడవదు. ప్రజలు సినిమా బాగా ఉంటేనే ఆదరిస్తారని చెప్పారు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ప్రస్తుతం ప్రేక్షకులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓ సినిమా బాగలేకపోతే మరో సినిమాకి వెళ్తున్నారు. బాగున్న చిత్రాలనే ఆదరిస్తారని చెప్పారు. మంచి సినిమాలు సౌత్‌లో ఇప్పుడు చాలా వస్తున్నాయని చెప్పారు సోనూ సూద్‌. ప్రస్తుతం ఆయన తమిళం, హిందీలో సినిమాలు చేస్తున్నాడు. ‘తమిళరసన్’, ‘ఫతే’ చిత్రాల్లో కనిపించనున్నాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్