అప్పుడే అనిల్ రావిపూడిని రాజమౌళి పక్కన కూర్చోబెట్టారే!

Published : May 28, 2022, 06:27 PM ISTUpdated : May 28, 2022, 06:32 PM IST
అప్పుడే అనిల్ రావిపూడిని రాజమౌళి పక్కన కూర్చోబెట్టారే!

సారాంశం

అప్పుడే అనిల్ రావిపూడిని రాజమౌళితో పోల్చుతున్నారు. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు లిస్ట్ లో చేర్చేస్తున్నారు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత అతడే అంటున్నారు. కానీ అప్పుడే అనిల్ రావిపూడిని రాజమౌళితో పోల్చడం విడ్డూరాం అంటున్నారు జనాలు.

సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళిది ఘన చరిత్ర. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. కెరీర్ బిగినింగ్ నుండి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన మేధావి. అనేక క్రాప్ట్స్ లో పట్టు సాధించిన మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్. ముఖ్యంగా కమిటెడ్ డైరెక్టర్. క్వాలిటీ కోసం సహనంగా వేచి చూస్తాడు. ఇక ఆయన చిత్రాల రికార్డ్స్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. క్రికెట్ లో సచిన్ లాగా సినిమాల్లో రాజమౌళి అని చెప్పొచ్చు. రాజమౌళి కొత్త సినిమా వచ్చే వరకు ఆయన గత చిత్రాల రికార్డ్స్ అలానే ఉంటాయి. ఆయన రికార్డ్స్ ఆయనే బ్రేక్ చేసుకుంటూ ఉంటాడు. 

షార్ట్ గా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) గురించి ఇది. అయితే కేవలం సక్సెస్, ప్లాప్ అనే పాయింట్ తీసుకొని అనిల్ రావిపూడిని రాజమౌళితో పోల్చుతున్నారు. రాజమౌళి మాదిరి అనిల్ రావిపూడి కూడా దర్శకుడిగా ప్లాప్ ఇవ్వలేదంటున్నారు. ఆ కోణంలో అనిల్ రావిపూడి మరో రాజమౌళి అంటున్నారు. ఈ పాయింట్ ఆధారంగా మాట్లాడుకున్నా రావిపూడిని రాజమౌళితో పోల్చలేం. కారణం అనిల్ రావిపూడి ఖాతాలో అన్నీ క్లీన్ హిట్స్ లేవు. 

దర్శకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఫస్ట్ చిత్రం పటాస్. ఇది సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ఆ నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ తో చేసిన సుప్రీమ్, రవితేజ రాజా ది గ్రేట్ యావరేజ్ లేదా అబౌవ్ యావరేజ్ చిత్రాలు. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్స్ గా ఉన్నాయి. ఇక లేటెస్ట్ రిలీజ్ ఎఫ్3 (F3 Movie)ఫలితం రావాల్సి ఉంది. రూ. 70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఎఫ్3 రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడితేనే క్లీన్ హిట్ అవుతుంది. 

ఇక రాజమౌళి చేసిన 12 చిత్రాల్లో సగానికి పైగా ఇండస్ట్రీ హిట్స్, మరికొన్ని బ్లాక్ బస్టర్స్ గా ఉన్నాయి. స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ కాగా, సై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే మిగతా చిత్రాల కంటే తక్కువ స్థాయి విజయాలు నమోదు చేసుకున్నాయి. కాబట్టి ఏ విధంగానూ రాజమౌళికి అనిల్ రావిపూడి పోలిక కాదనేది నెటిజెన్స్ అభిప్రాయం... 
 

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?