
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఓ ఎత్తు, ఇప్పుడు చేయబోయే సినిమా మరో ఎత్తు. ఈ సంక్రాంతికి `గుంటూరు కారం`తో మన ముందుకు వచ్చిన మహేష్ నెక్ట్స్ రాజమౌళితో సినిమా(SSMB29) చేయబోతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇంటర్నేషన్ ఫిల్మ్ గా మహేష్‌తో సినిమా ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే ఆయన జుట్టు పెంచి హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు. ఇటీవల అంబానీ పెళ్లిలో ఆయన లుక్ అందరిని సర్‌ప్రైజ్ చేసింది. ఆ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు మహేష్. అంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే రాజమౌళి సినిమా లుక్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కాస్టింగ్ ఎంపిక కూడా జరుగుతుందట. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా? ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా? అని అంతా వెయిట్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈగర్‌గా ఉన్నారు. కానీ ప్రారంభానికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వడం లేదు రాజమౌళి. స్క్రిప్ట్ లాక్ అయిన, కాస్టింగ్ ఫైనల్ అయిన తర్వాత ఈ మూవీ ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ రెడీ అవుతుందట. మహేష్ బాబు పుట్టిన రోజున రాజమౌళితో సినిమా ప్రకటన ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే ఈ బర్త్ డే మహేష్ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్‌లా ఉండబోతుందని చెప్పొచ్చు.
అంతేకాదు మహేష్ పుట్టిన రోజున మరో ట్రీట్ రాబోతుంది. ఆయన నటించిన సినిమా మళ్లీ రీలీజ్(రీ రిలీజ్) కాబోతుంది. మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక వచ్చిన తొలి హిట్ మూవీ `మురారి`. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులోని `అలనాటి రామచంద్రుడు` అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సోనాలీ బింద్రే ఇందులో హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఇది పెద్ద హిట్. మహేష్‌కి ఫస్ట్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీని రీ రిలీజ్‌చేస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజు(ఆగస్ట్ 9)న రిలీజ్ 4కే వెర్షన్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా ఓ వైపు రాజమౌళి సినిమా ప్రకటన, మరోవైపు `మురారి` రీ రిలీజ్ తో ఈ సారి మహేష్ బాబు పుట్టిన రోజు అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.