
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `సారంగదరియా`. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు సమర్పణలో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటికల్‌గానూ ప్రశంసలందుకుంది. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పై టీమ్ సక్సెస్ మీట్‌లో స్పందించింది.
మెయిన్ రోల్ చేసిన రాజా రవీంద్ర మాట్లాడుతూ, మా సినిమాకి మంచి థియేటర్లు దొరికాయి. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ టీం చాలా కష్టపడింది. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు హ్యాపియెస్ట్ మూమెంట్. నా కెరీర్‌లో ఇదొక మంచి చిత్రంగా నిలిచింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్` అన్నారు రాజా రవీంద్ర. ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
హైదరాబద్‌లో ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో..
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి హైదరాబాద్‌లో లైవ్ షో చేస్తున్నారు. ఆయన ఇటీవలే సిటీల లైవ్ షో పర్ఫార్మెన్స్ ఉంటుందని స్వయంగా ప్రకటించారు. ఇలా దేశవ్యాప్తంగా ఆయన మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచే ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన చూసిన సంగీత ప్రియుల ఆనందానికి అవదులు లేవు. 25 సంవత్సరాలుగా తాను సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించారు. అలాంటిది మొదటి సారి హైదరాబాద్‌లో డీఎస్‌పీ లైవ్ షో ఉంటుందంటే ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇన్నాళ్లు సినీ ప్రపంచంలో సంగీత రారాజుగా ఉన్నాడు. తెలుగు, తమిళ్, హిందీ ఇతర భాషాల్లో సైతం సంగీతం అందించి అందరినికి ఉర్రుతలూగించారు. ఇప్పుడు లైవ్ షో ద్వారా తన సొంత ప్రజల్ని, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న అభిమానులను అలరించాడానికి సిద్దం అయ్యారు. US, UK, యూరప్, ఆస్ట్రేలియా, UAE లతో పాటు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చారు. అందులో భాగంగా సొంత గడ్డ హైదరాబాద్‌లో ఆయన మొదటి ప్రదర్శనతో ఈ #DSPLiveIndiaTour ప్రారంభించనున్నారు.
#DSPLiveIndiaTour ప్రొగ్రామ్‌ను, ACTC అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది. ఇది కేవలం సంగీత కచేరీ మాత్రమే కాదు, డ్యాన్సులతో అలరించే ఓ అద్భుతమైన సందడి కలిగించే ఈవెంట్. డీఎస్‌పీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఎన్నో హై-ఎనర్జీ ట్యూన్‌లతో ఈ షో ఉంటుందని చెబుతున్నారు. ఈ హై వోల్టేజ్ డీఎస్‌పీ కాన్సెర్ట్ చూడాలనే ఆసక్తి ఉన్నవారు ACTC ఈవెంట్‌లు, DSP సోషల్ మీడియా ఖాతాలను
గమనిస్తూ ఉండాలి. నగరంలో అక్టోబర్ 19న జరగబోయే కాన్సెర్ట్ కోసం ACTC ఈవెంట్ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ కాన్సెర్ట్ కోసం టిక్కెట్లు పొందాలంటే www.actcevents.com అనే వైబ్ సైట్ ద్వారా , అలాగే Paytm ఇన్‌సైడర్‌లో టిక్కెట్‌లు కొనుగోలు చేయవచ్చు. జూలై 14, 2024 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వహాకులు తెలిపారు.
హైదరాబాద్ లో మొదలైన డెడ్ పుల్ & వాల్వరిన్ బుకింగ్స్..
మార్వెల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల అభిమానలకి సంబరాల్లో మునిగితేలుతుంటారు. మార్వెల్ యూనీవర్స్ నుంచి `డెడ్ పుల్` సిరీస్ లో భాగంగా జూలై 26న `డెడ్ పుల్ & వాల్వరిన్` మూవీ రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్ తో పాటు వాల్వరిన్ కూడా వెండితెర పై అద్భుత విన్యాసాలు చేయబోతున్నాడు. ఇద్దరు సూపర్ హీరోలు ఒకేసారి అభిమానులు ముందుకు రానున్న నేపథ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మోస్ట్ ఫెవరేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది.
తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైదరబాద్ లో మార్వెల్ సినిమాలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే `డెడ్ పుల్ & వాల్వరిన్` టికెట్లు బుకింగ్ మొదలైన సందర్భంగా తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ చాటుకున్నారు. ఈ సెలబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి. డెడ్ పుల్ & వాల్వరిన్ లో ప్రధానపాత్రధారులుగా రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ నటిస్తున్నారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డెడ్ పుల్ & వాల్వరిన్ విడుదలవ్వనుంది. మరి గత చిత్రాల మాదిరిగా దీనికి రెస్పాన్స్ వస్తుందా అనేది చూడాలి.